ఆటాపోటీ

భారీ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫా బట్జెట్ సామాన్యమైనది కాదు. 33,137 మిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ఒక చిన్న దేశ వార్షిక బడ్జెట్‌ను తలపిస్తుంది. 30,799 మిలియన్ డాలర్లు (సుమారు 2,66,937 కోట్ల రూపాయలు) యూత్ ఫుట్‌బాల్ కోసం వెచ్చిస్తున్నది. 2,225 మిలియన్ డాలర్లు పురుషుల విభాగంలో, 112.5 మిలియన్ డాలర్లను మహిళల విభాగంలో వౌలిక సదుపాయాలకు, పోటీలు, టోర్నీలకు వెచ్చిస్తున్నది.

ఖరీదైన క్లబ్ బార్సిలోనా
ఫిఫా16 ప్రాజెక్టులో అత్యంత ఖరీదైన జట్టు బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి) వంటి క్లబ్‌లు కూడా కోట్లకు పడగలెత్తాయి. బార్సిలోనా కేవలం ట్రాన్స్‌ఫర్స్‌కే 100 మిలియన్ యూరోలను కేటాయించి, మిగతా క్లబ్‌ల కంటే ముందున్నది. అయితే, బడ్జెట్ విషయంలో మాత్రం బార్క్‌లే ప్రీమియర్ లీగ్‌ది అగ్రస్థానం. ఈ క్లబ్ వార్షిక బడ్జెట్ 789.5 మిలియన్ యూరోలు.

వేలల్లో క్రీడాకారులు
ఫిఫా 16 కెరీర్‌లో క్రీడాకారుల సంఖ్య వేలల్లో ఉంది. పదహారు వేలకుపైగా క్రీడాకారులను ఇప్పటికే ఫిఫా గుర్తించింది. 15,650 మంది అధికారికంగా వివిధ స్థాయి పోటీల్లో ఆడుతున్నారు. సాకర్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు.

శిక్షణ శిబిరాలు
కేవలం క్రీడాకారులకే కాదు.. ఇతర సిబ్బందికి కూడా ఫిఫా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రిఫరీలకు 1,249, విద్యావసరాలకు 1,134, ప్రమాణాల పెరుగులదలకు 852, మహిళల కోసం 777, అట్టడుగు స్థాయిలో సమర్థులను ఎంపిక చేయడానికి 430, ఇతరత్రా అంశాల్లో శిక్షణ కోసం 280 శిబిరాలను ఫిఫా నిర్వహిస్తున్నది.
735 ప్రాజెక్టులు
ఫిఫా గోల్ ప్రోగ్రామ్ కింద 735 ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా 271 టెక్నికల్ సెంటర్లను, 162 ఫుట్‌బాల్ పిచ్‌లను, 151 ప్రధాన కార్యాలయాలను, 71 ఇతర కార్యాలయాలను, 36 ఫుట్‌బాల్ అకాడెమీలను, 44 శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నది.

- సత్య