ఆటాపోటీ

‘బాయ్’ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన స్టార్లు జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయంచుకున్న భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-50’లో చోటు దక్కించుకున్న వారికి రాబోయే 82వ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడే అవకాశం కల్పించాలన్నది ఈ నిర్ణయాల్లో ప్రధానమైనది. దీనితో మహిళలు, పురుషుల విభాగాల్లో కలిపి క్వార్టర్ ఫైనల్స్‌లో ఉండే 16 మందిలో ఎనిమిది మందిని ఈ విధానంలో ఎంపిక చేస్తామని బాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం, సైనా నెహ్వాల్, పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ వంటి సూపర్ స్టార్లు క్వార్టర్స్‌కు క్వాలిఫయర్స్ జాబితాలో ఉంటారు. అదే విధంగా, హెచ్‌ఎస్ ప్రణయ్ (15వ ర్యాంక్), సాయి ప్రణీత్ (17వ ర్యాంక్), సమీర్ వర్మ (19వ ర్యాంక్), అజయ్ జయరామ్ (20వ ర్యాంక్), సౌరవ్ వర్మ (33వ ర్యాంక్) కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడేందుకు అర్హత సంపాదిస్తారు. వీరితో మొత్తం ఎనిమిది స్థానాలు పూర్తవుతాయి. ఫలితంగా, ప్రస్తుతం 46వ స్థానంలో ఉన్న పారుపల్లి కశ్యప్‌కు క్వార్టర్స్‌లో డైరెక్ట్ ఎంట్రీ లభించదు.

సాటర్లంతా ఆడాల్సిందే..

జాతీయ చాంపియన్‌షిప్స్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడే లేదా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న వారంతా ఆడాల్సిందేనని బాయ్ అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మ స్పష్టం చేశాడు. టోర్నమెంట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికే ఎనిమిది ప్రపంచ మేటి క్రీడాకారులకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కల్పించామని చెప్పాడు.

ప్రైజ్ మనీ రూ. కోటి..

జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌కు ఎక్కువ మంది మేటి స్టార్లను రప్పించడం ద్వారా ఆ టోర్నీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి, ప్రేక్షకులతో స్టాండ్స్ నిండిపోయేలా చూడడానికి బాయ్ విశేషంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ప్రైజ్‌మనీని ఏకంగా కోటి రూపాయలకు పెంచింది. క్రెకెట్‌ను మినహాయిస్తే, ఇంత భారీ మొత్తం దేశంలో మరే ఇతర క్రీడకూ లేదు. ఈ పెంపుతోపాటు పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఎనిమిది స్లాట్లను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-50’ జాబితాలో ఉన్నవారికి కేటాయించాలన్న నిర్ణయం కూడా ఈ టోర్నమెంట్‌కు ఊతమివ్వడం ఖాయం.