ఆటాపోటీ

ఆర్చరీ కోచ్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) కోచ్ సునీల్ కుమార్‌పై వేటుపడింది. ఇటీవల అర్జెంటీనాలో యూత్ వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ జరిగినప్పుడు బ్రిటన్‌కు చెందిన ఒక మహిళా ఆర్చర్‌ను కౌగలించుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ మూడు స్వర్ణాలను సాధించింది. అయితే, బ్రిటన్ ఆర్చర్‌ను హత్తుకోవడం వివాదం సృష్టించగా, సునీల్ కుమార్‌ను అక్కడి నుంచి స్వదేశానికి పంపేశారు. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య నిబంధనల ప్రకారం అతని ప్రవర్తన శిక్షార్హమైన నేరం. కాగా, ఈ వివాదంపై చర్చించిన ఎఎఐ అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆంతరంగిక విచారణ జరిపిస్తామని, దాని నివేదిక అందే వరకూ సునీల్ కుమార్‌ను అతని బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని ఎఎఐ ప్రధాన కార్యదర్శి అనిల్ కామినేని తెలిపాడు.