ఆటాపోటీ

మా అబ్బాయితో కలిసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న కెరీర్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనని అయితే, తన కుమారుడితో కలిసి మ్యాచ్‌లు ఆడాలని ఉందని బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాయ్ జేమ్స్ వ్యాఖ్యానించాడు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను తన ఇష్టాయిష్టాలను బహిర్గతం చేశాడు. సాధ్యమైనంత ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగిస్తానని 32 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ అన్నాడు. వీలుంటే, తన 13 ఏళ్ల కుమారుడు లెబ్రాన్ జూనియర్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడాలని ఉత్సాహపడుతున్నట్టు చెప్పాడు.
ఫిట్నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడతానని, తన కుమారుడి విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తానని కెరీర్‌లో మియామీ క్రీడాకారుడిగా రెండు పర్యాయాలు, ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న క్లేవ్‌లాండ్ కవాలియర్స్ తరఫున ఒకసారి చొప్పున మొత్తం మూడుసార్లు ఎన్‌బిఎ టైటిళ్లు సాధించిన అతను, మరో ఐదు పర్యాయాలు రన్నరప్ ట్రోఫీని దక్కించుకున్నాడు. అమెరికా బాస్కెట్‌బాల్ రంగంలో మైఖేల్ జోర్డాన్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు ఆర్జించిన అతను క్లేవ్‌లాండ్‌కు అత్యుత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
కాంట్రాక్టును పొడిగించుకోను..
ఈ సీజన్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడతానో చెప్పలేనని, అందుకే వచ్చే సీజన్‌లో కాంట్రాక్టును పొడిగించుకోబోనని లెబ్రాన్ జేమ్స్ స్పష్టం చేశాడు. ఆరు పర్యాయాలు ఎన్‌బిఎ ఫైనల్స్‌లో ఆడిన మైఖేల్ జోర్డాన్ అన్నింటిలోనూ విజేతగానే నిలిచాడని, అతనితో తనను పోల్చడానికి వీల్లేదని చెప్పాడు. వచ్చే సీజన్‌లో క్లేవ్‌లాండ్‌తో కాంట్రాక్టును పొడిగించుకోకపోయినా, స్వతంత్ర ఏజెంట్ హోదాలో ఆ క్లబ్‌కు సేవలు అందిస్తానని తెలిపాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ 40 ఏళ్లు వచ్చే వరకూ ఎన్‌బిఎలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదన్నాడు. ఎక్కువ కాలం ఆటగాడిగా కొనసాగడమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు.