ఆటాపోటీ

కంప్యూటర్ల సాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది చెస్ ఆటగాళ్లు ఇప్పుడు కంప్యూటర్ల సాయం తీసుకుంటున్నారు. ముందుగా కొన్ని వేలు, లక్షల ఎత్తులను ఫీడ్ చేసి ఉంచడంతో, ప్రత్యర్థుల ఎత్తుగడులను ఏ విధంగా తప్పికొట్టాలనే విషయంపై అవగాహన పెంచుకోవడానికి కంప్యూటర్‌లో గేమ్ ఆడడాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. మనిషికీ, యంత్రానికి మధ్య చెస్ పోటీలు కూడా జరిగాయి. 1997లో అప్పటి ప్రపంచ చాంపియన్ గారీ కాస్పరోవ్, ఐబిఎం కంపెనీకి చెందిన డీప్ బ్లూ కంప్యూటర్ మధ్య పోటీ సంచలనం సృష్టించింది. చెస్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించిన కాస్పరోవ్‌ను డీప్ బ్లూ ఓడించడాన్ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మోసం జరిగిందంటూ గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత మరోసారి అంతటి సంచలనం రేపిన గేమ్ 2006లో, నాటి ప్రపంచ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్, డీప్ ఫ్రిడ్జి కంప్యూటర్ మధ్య జరిగింది. ఆ గేమ్‌లోనూ విజయం కంప్యూటర్‌కే దక్కడం విశేషం.