ఆటాపోటీ

సూపర్ సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ ప్రపంచంలో సచిన్ తెండూల్కర్‌ను మించిన బ్యాట్స్‌మన్ లేడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సూపర్ సచిన్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలోనూ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. లంకతో 25 టెస్టుల్లో 36 ఇన్నింగ్స్ ఆడిన అతను మూడు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, 1,995 పరుగులు సాధించాడు. లంకపై అతని అత్యధిక స్కోరు 203 పరుగులు. ఈ జాబితాలో మహేల జయవర్ధనే (1,822 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (1,508 పరుగులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇరు జట్ల టెస్టు సిరీస్‌ల్లో 1000 లేదా అంతకు మించి పరుగులు సాధించిన వారిలో కుమార సంగక్కర (1,352), అరవింద డిసిల్వ (1,252), వీరేందర్ సెవాగ్ (1,239), మహమ్మద్ అజరుద్దీన్ (1,215), సౌరవ్ గంగూలీ (1,064) కూడా ఉన్నారు.
అత్యధిక సెంచరీల రికార్డు కూడా సచిన్ పేరుమీదే ఉంది. శ్రీలంకపై అతను తొమ్మిది టెస్టు సెంచరీలు చేశాడు. మహేల జయవర్ధనే ఆరు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరేందర్ సెవాగ్, మహమ్మద్ అజరుద్దీన్, కుమార సంగక్కర, అరవింద డిసిల్వ తలా ఐదేసి సెంచరీలు చేశారు.