ఆటాపోటీ

మొనగాడు బ్రాడ్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాషెస్ సిరీస్ నిజమైన మొనగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్. ఆస్ట్రేలియాకు కొండంత అండగా నిలిచిన అతను యాషెస్‌లో నెలకొల్పిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే, అతని ప్రతిభాపాటవాలను ఊహించుకోవచ్చు. యాషెస్‌లో అత్యధిక పరుగులు (5,028), అత్యధిక శతకాలు (19), అత్యధిక అర్ధ శతకాలు (31), ఒక సిరీస్‌లో ఎక్కువ పరుగులు (974), అత్యుత్తమ భాగస్వామ్యం (451) వంటి బ్రాడ్‌మన్ రికార్డులను ఎవరూ ఛేదించలేకపోతున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు రాజ్యమేలుతున్నందున, భవిష్యత్తులోనూ ఈ రికార్డులను బద్దలు చేసే బ్యాట్స్‌మన్ అటు ఇంగ్లాండ్‌లోగానీ, ఇటు ఆస్ట్రేలియాలోగానీ రాడనే అనుకోవాలి.

ఒక్కడి కోసమే..

ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఒక ఎత్తు.. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఒక్కడే ఒక ఎత్తు.. ఈ రహస్యం ఇంగ్లాండ్‌కు బాగానే తెలుసు. 1932-33 సీజన్‌లో యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లర్ జార్డిన్‌కు బ్రాడ్‌మన్ భయం పట్టుకుంది. సాధారణమైన బంతులతో అతనిని ఔట్ చేయడం అసాధ్యమని తెలిసిన అతను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, ప్రత్యేకించి బ్రాడ్‌మన్‌ను గాయపరచేలా బంతులు వేయాలని ఫాస్ట్ బౌలర్లు బిల్ వోస్, హరాల్డ్ లార్‌వుడ్‌ను ఆదేశించాడు. ఎక్కువ మంది ఫీల్డర్లను లెగ్‌సైడ్‌లో మోహరింప చేసి, ఆటగాళ్ల ఛాతీ లేదా తలకు తగిలేలా బంతులు సంధించాలని ఫాస్ట్ బౌలర్లను కోరాడు. అతని వ్యూహం ఫలించింది. స్టంప్స్‌ను కాకుండా బ్యాట్స్‌మెన్ శరీరాలను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ వేయడాన్ని ‘బాడీలైన్’గా అభివర్ణించారు. ఆ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-1 తేడాతో గెల్చుకున్నప్పటికీ, ఆ జట్టు అనుసరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాతి కాలంలో, ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మెన్‌ను గాయపరచే విధంగా ‘బాడీలైన్’ వ్యూహాన్ని అనుసరించడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీ ప్రకటించింది.