ఆటాపోటీ

‘ది ఓవల్’లో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా జట్టు 1882లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ‘ది ఓవల్’ మైదానంలో ఏకైక టెస్టు ఆడింది. మూడు రోజుల ఆ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగిన ఓవల్ టెస్టు ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్‌కు కారణమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 80 ఓవర్లు ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ బ్లాక్‌హామ్ 17 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్, మర్దోచ్ (కెప్టెన్) 13, గారెట్ 10 పరుగులతో రెండంకెల స్కోరు సాధించగలిగారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బార్లో ఐదు, పియేట్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసింది. టాప్ స్కోరర్ ఉలియెట్ 26 పరుగులు నమోదు చేశాడు. ఆసీస్ పేసర్ ఫ్రెడ్ స్పోఫోర్త్ ఏడు వికెట్లు పడగొట్టగా, హెన్రీ బోయెల్‌కు రెండు వికెట్లు లభించాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 122 పరుగులకు ఆలౌటైంది. హాగ్ మాసీ 55 పరుగులు చేసినప్పటికీ ఆసీస్ భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. విజయానికి కేవలం 85 పరుగులు అవసరమైనదశలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, అనూహ్యంగా 77 పరుగులకే కుప్పకూలింది. డబ్ల్యుసి గ్రేస్ చేసిన 32 పరుగులే అత్యధిక స్కోరు. స్పోఫోర్త్ ఏడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అతను కేవలం రెండు పరుగులిచ్చి చివరి నాలుగు వికెట్లను కూల్చడంతో ఇంగ్లాండ్ ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెస్టు చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల్లో ఓవల్ టెస్టు అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ పరాజయం కారణంగానే ఇంగ్లాండ్ జట్టు మృతి చెందిందని మీడియా అభివర్ణించింది. దహన సంస్కారాలు కూడా జరిగాయ. బేల్స్‌ను కాల్చి బూడిదను ఆస్ట్రేలియా సగర్వంగా స్వదేశానికి తీసుకెళ్లింది. యాషెస్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ, ఈ సిరీస్ ప్రాధాన్యంగానీ, ప్రాచు ర్యంగానీ, ఇరు జట్ల పోటీతత్వంగానీ ఏమాత్రం తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది.