ఆటాపోటీ

అచ్చిరాని బౌలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వనే్డ ప్రపంచ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్స్ విభాగంలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్‌కు బౌలింగ్ అచ్చిరావడం లేదు. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు రావడంతో, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ అతను బౌలింగ్ చేయడానికి వీల్లేదని ఐసిసి ఆదేశించింది. అతను బయోమెకానికల్ పరీక్షకు హాజరై బౌలింగ్ యాక్షన్‌పై క్లీన్‌చిట్ సంపాదించాల్సి ఉంటుంది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం కావడం ఇది రెండోసారి. 2015లో మొదటిసారి ఇదే ఫిర్యాదుపై అతను సుమారు 12 నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. 2016 నవంబర్‌లో బయో పరీక్షకు హాజరై, క్లీన్‌చిట్ సంపాదించాడు. తిరిగి ఇప్పుడు మరోసారి బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అందుకే, బౌలింగ్ అచ్చిరావడం లేదని, ఇకపై బ్యాటింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించాలని వకార్ యూనిస్, వసీం అక్రం వంటి మాజీ క్రికెటర్లు అతనికి సూచిస్తున్నారు. వారి సలహాలను పాటిస్తేనే మంచిదేమో!

- సత్య