ఆటాపోటీ

పారని ఎత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు రామచంద్రన్ వేసిన అద్భుతమైన ఎత్తును అతని ప్రత్యర్థులు చిత్తుచేశారు. ఫలితంగా డిసెంబర్ 14న జరిగే ఎన్నికల్లో ఐఒఎ అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదంటూ అతను ప్రకటించాల్సి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)లో వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడి, చివరికి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిన శ్రీనివాసన్‌కు రామచంద్రన్ స్వయానా తమ్ముడు. సోదరుడి మాదిరిగానే అతను కూడా క్రీడా రంగంపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నించాడు. కానీ, శ్రీనివాసన్ మాదిరిగానే ఎదురుదెబ్బ తిన్నాడు. చివరికి, ఒకప్పుడు తాను శాసించిన ఐఓసీలోనే వ్యతిరేకతను కొనితెచ్చుకున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) నిబంధనలను అనుసరించి 70 ఏళ్లు దాటిన వారు ఐఓఏలో ఎలాంటి పదవులు పొందడానికి వీల్లేదు. 69 ఏళ్ల రామచంద్రన్ ఒకవేళ ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే, ఏడాది పాటు ఆ పదవిలో ఉంటాడు. ఆతర్వాత తదుపరి ఎన్నికలు జరిగే వరకూ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరినైనా నియమించాల్సి ఉంటుంది. వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) చెన్నైలో నిర్వహించడం ద్వారా, మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలను మెరుగు పరచుకోవచ్చని రామచంద్రన్ భావించాడు. వ్యూహాత్మకంగా వ్యవహించి, చెన్నైలో ఏజీఎం జరగాలని ప్రతిపాదించాడు. అయితే, ఈ ప్రతిపాదనకు ఐఓఏలోని అతని వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అభ్యంతరం తెలిపాడు. ఢిల్లీలోనే సమావేశం జరగాలని పట్టుబట్టాడు. అంతేగాక, ఐఓఏ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి, ఢిల్లీలోనే ఏజీఎం జరగాలని తీర్మానించారు. ఆ సమావేశానికి మొత్తం 21 మంది కార్యవర్గ సభ్యులు హాజరుకాగా, 19 మంది ఢిల్లీకి అనుకూలంగా ఓటు వేశారు. దీనితో డిసెంబర్ 14న ఏజీఎంను రామచంద్రన్ ఢిల్లీకి మార్చక తప్పలేదు. కార్యవర్గ సభ్యుల్లోనే ఎక్కువ మంది తనను వ్యతిరేకిస్తున్నారన్న విషయం కూడా అతనికి స్పష్టమైంది. చెన్నైలో సమావేశం జరిగితే, ఏదో ఒక విధంగా సభ్యులను మచ్చిక చేసుకొని మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని, ఏడాది తర్వాత తన అరుచరుల్లో ఎవరో ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించి, తెర వెనుక నుంచి తాను పెత్తనం చేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ, రాజీవ్ మెహతా వర్గం వేసిన పైఎత్తుకు రామచంద్రన్ చిత్తయ్యాడు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ప్రకటించాల్సి వచ్చింది. వయసును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను పేర్కొంటున్నప్పటికీ, ఐఓఏ పాలక మండలిలోనే తన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం కావడమే ప్రధాన కారణమని అంటున్నారు.
హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా వ్యవహరించిన నరీందర్ బత్రాతో రామచంద్రన్‌కు అసలు పడేది కాదు. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఉన్న బత్రా సహజంగానే రామచంద్రన్ మరోసారి ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. రాజీవ్ మెహతా మద్దతు కూడగట్టుకున్న బత్రా దృష్టి ఐఓఏ అధ్యక్ష పీఠంపై ఉంది. అతను పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో, తనకు విజయావకాశాలు లేవని రామచంద్రన్‌కు అర్థమైంది. దీనితో అతను అధ్యక్ష పదవికి రేసు నుంచి తప్పుకొన్నాడు. అయితే, లలిత్ బానోత్‌కు పరోక్షంగా మద్దతు పలకవచ్చని అంటున్నారు. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి అనియోగాలతో 2012లో ఐఓఏ కార్యదర్శి పదవికి బానోత్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతను కూడా ఐఓఏ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్టు సమాచారం. బానోత్ పోటీకి దిగితే, రామచంద్రన్ వర్గం అతనికి కొమ్ముకాయడం ఖాయం. అయితే, రాజీవ్ మెహతా, నరీందర్ బత్రా ధాటికి ఈ వర్గం ఎంత వరకూ ఎదురొడ్డి నిలుస్తుందనేది అనుమానమే. మొత్తం మీద ఐఓఏపై పెత్తనాన్ని కొనసాగించేందుకు వేసిన ఎత్తుగత చిత్తుకావడంతో రామచంద్రన్ ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించక తప్పదు.