ఆటాపోటీ

వనే్డ, టి-20 బాధ్యతలకు లీమన్ గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిశ్రాంత అంతర్జాతీయ షెడ్యూల్ ఇదే రీతిలో కొనసాగితే, వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్‌లో బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశాలు లేకపోలేదని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ డారెన్ లీమన్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, ఇటీవల కాలంలో క్రికెట్ క్యాలండర్ వివిధ సిరీస్‌లు, టోర్నీలతో నిండిపోతున్నదని, దీనితో విశ్రాంతి లభించడం లేదని అన్నాడు. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కోచ్‌గా బాధ్యతలకు గుడ్‌బై చెప్పక తప్పదని, ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని 47 ఏళ్ల లీమన్ అన్నాడు. కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు కూడా తనను మరో దిశగా ఆలోచించేలా చేస్తున్నాయని తెలిపాడు. టెస్టు ఫార్మాట్‌పై దృష్టిని కేంద్రీకరించి, మిగతా బాధ్యతలకు దూరంగా ఉండాలనే ఆలోచన వస్తున్నదని చెప్పాడు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ, అతి త్వరలోనే ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదని స్పష్టం చేశాడు.