ఆటాపోటీ

నిన్న హీరో నేడు జీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిక్కిరిసిన స్టేడియం లేదు.. వేలాది మంది హర్షధ్వానాలు లేవు.. కనీసం ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా కాదు.. జాతీయ టి-20 కప్ వంటి అత్యంత సాధారణమైన టోర్నీలో ఫైసలాబాద్ తరఫున ఆడిన పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన సరుూద్ అజ్వల్ సెమీ ఫైనల్స్‌లో లాహోర్ వైట్స్ చేతిలో ఓడిన వెంటనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ టోర్నమెంట్‌కు అంతగా ఆదరణ లేకపోవడంతో, రావల్పిండి స్టేడియం దాదాపు ఖాళీగా కనిపించింది. అక్కడక్కడ పదుల సంఖ్యలో కనిపిస్తున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ అతను మైదానం వెలుపలికి నడిచాడు. ఫైసలాబాద్, లాహోర్ వైట్స్ జట్ల ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వకపోతే, అతని పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఏ దేశంలోనైనా ఒక అంతర్జాతీయ క్రికెటర్ రిటైర్ అవుతున్నాడంటే, అతనికి ఫేర్‌వెల్ చెప్పేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేస్తుంది. అట్టహాసంగా వీడ్కోలు పలుకుతుంది. కెరీర్‌ను ఒక అంతర్జాతీయ మ్యాచ్‌తో ముగించేలా జాగ్రత్త పడుతుంది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు అతని హోం పిచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వీడ్కోలు చెప్పిన సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. న్యూజిలాండ్‌తో జరిగిన టి-20 సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో నెహ్రాకు చోటు దక్కలేదు. కానీ, ఢిల్లీలోనే రిటైర్మెంట్ ప్రకటించాలని ఉందని అతను పేర్కొవడంతో, బీసీసీఐ ఆ ఒక్క మ్యాచ్‌కోసం చేర్చింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీ కూడా సానుకూలంగా స్పందించడంతో, ప్లేయింగ్ ఎలెవెన్‌లో నెహ్రాకు చోటుదక్కింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో, అతను తన హోం గ్రౌండ్‌లోనే కెరీర్‌ను ముగించడానికి బీసీసీఐ తోడ్పడింది. కానీ, అజ్మల్ పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కనీస గౌరవాన్ని చూపలేదు. ఏళ్ల తరబడి దేశానికి సేవలు అందించిన క్రీడాకారుడికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. ఫలితంగా అతని కెరీర్‌కు అత్యంత అవమానకరమైన రీతిలో తెరపడింది. ఎన్నో టోర్నీలు, సిరీస్‌ల్లో పాక్‌ను విజయపథంలో నడిపి, అసలు సిసలైన హీరోగా ప్రశంసలు పొందిన అతను ఫామ్‌తోపాటు ప్రజాభిమానాన్ని కూడా కోల్పోయాడు. బౌలింగ్ యాక్షన్‌పై రెండు పర్యాయాలు అభ్యంతరాలు రావడం కూడా అతని కెరీర్‌ను దెబ్బతెసింది. కారణాలు ఏవైతేనేం.. కనీసం ఒక అంతర్జాతీయ మ్యాచ్‌తో కెరీర్‌ను ముగించే అవకాశం కూడా అతనికి రాలేదు. క్రికెటర్లు ఉద్వేగభరితమైన స్పీచ్‌తో కెరీర్‌కు తెరదించితే, అజ్మల్ కన్నీళ్లతో నిష్క్రమించాడు. పీసీబీ అధికారులే కాదు.. కనీసం స్థానిక క్రికెట్ సంఘం అధికారులు కూడా రాకపోవడంతో, అవమాన భారంతో తల దించుకొని వెళ్లిపోయాడు. నిన్న హీరోగా వెలిగిపోయిన ఆ మేటి స్పిన్నర్ చివరికి జీరోగా మారి.. అనామకుడిగా నిష్క్రమించిన వైనం దారుణం. ఇలాంటి పరిస్థితి ఏ క్రీడాకారుడికీ ఎదురుకాకూడదు.