ఆటాపోటీ

ఇద్దరూ టేలర్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, టెస్టుల్లోకి రావడం సహజం. అందుకే, టెస్టులతో పోలిస్తే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనే వారి తొలి సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఉంటాయి. కానీ, ఇద్దరు టేలర్లు మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అర్ధ శతకాన్ని నమోదు చేయకుండానే, టెస్టులో తొలి సెంచరీని సాధించారు. 1965లో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రూస్ టేలర్ టెస్టులోనే తన మొదటి శతకాన్ని చేశాడు. 2008 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జెరోమ్ టేలర్ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 40 పరుగులు. మొత్తం మీద ఇద్దరు టేలర్లు టెస్టుల్లోనే తమతమ మొదటి శతకాన్ని అందుకోవడం విశేషం.

- సత్య