ఆటాపోటీ

గట్టివాడు రీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రగ్బీ మ్యాచ్‌ని ఎప్పుడైనా చూశారా? కనీసం ఆరు అడుగుల ఎత్తు, అంతులేని కండబలంతో ఒకరిపై ఒకరు పడుతూ, బంతి కోసం చేసే యుద్ధం చూడడానికే భయం వేస్తుంది. ఎవరి కాళ్లూ చేతులూ విరుగుతాయో, ఎంతటి తీవ్రమైన గాయాలు తగులుతాయోనని వణకిపోతాం. రెజ్లర్లను మించి బలం ఉంటేనే రగ్బీలో రాణించగలుతారు. కానీ, అమెరికా హెరిటేజ్ స్కూల్ తరఫున ఆడుతున్న ఆడం రీడ్ ఎత్తు కేవలం 4.5 గడుగులే. జట్టు ఆటగాళ్ల మధ్య ఎవరికీ కనిపించకుండా ఉండే అతను పొట్టివాడైనా, గట్టివాడే. మెరుపు వేగంతో కదలడం, ఎవరికీ దొక్కుండా బంతితో దూసుకెళ్లడం అతనికి పుట్టుకతోనే అబ్బిన లక్షణాలు. అవే రీడ్‌ను రగ్బీ క్రీడాకారుడిగా నిలబెట్టాయి. రగ్బీ చరిత్రలోనే ఇంత పొట్టి ఆటగాడు ఎవరూ లేరు. ఈ రకంగా అతను ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.