ఆటాపోటీ

గొప్ప ముగింపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ సూపర్ స్టార్, కెప్టెన్ జాన్ టెర్రీ రిటైర్మెంట్ ప్రకటించడం ఊహించిందే. కానీ, 19 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఒకే క్లబ్‌కు సేవలు అందించిన అతను చివరి మ్యాచ్ ఆడే సమయం రాగానే అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. చివరి మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా 26వ నిమిషంలో మైదానికి వచ్చినప్పుడు, స్టామ్‌ఫోర్ట్ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది. ప్రేక్షకులు లేచి నిలబడి, అతనికి గౌరవాన్ని ప్రకటించారు. ఆటగాళ్లు కూడా అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. జట్టు కోచ్ ఆంటానియో కొనే్ట అతనిని 26వ నిమిషంలో మైదానంలోకి పంపడానికి కారణముంది. చెల్సియాలో అతని జెర్సీ నంబర్ అదే. ఒక గొప్ప క్రీడాకారుడి కెరీర్ ముగింపు కూడా అంతే గొప్పగా జరిగింది. అతని జీవితం ధన్యమైంది.

- సత్య