ఆటాపోటీ

బిగ్ బాష్ సూపర్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా టి-20 లీగ్ బిగ్ బాష్ తాము ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని నిర్వాహకులు సంబర పడుతున్నారు. ఈసారి టోర్నీ టైటిల్‌ను పెర్త్ స్కాచర్స్ గెల్చుకుంది. సిడ్నీలోని వాకా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 141 పరుగులు చేసింది. బ్రాడ్ హాడిన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్ జెరుూ రిచర్డ్‌సన్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే, 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 144 పరుగులు సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మైఖేల్ క్లింగర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్‌కీపర్ శామ్ వైట్‌మన్ 41 పరుగులు చేశాడు. కాగా, వాకా స్టేడియంలో ఫైనల్‌ను తిలకించేందుకు సుమారు యాభై వేల మంది ప్రేక్షకులు వస్తే, టోర్నీ విజయవంతమైనట్టేనని నిర్వాహకులు తొలుత భావించారు. అయితే, వారి అంచనాలకు మించి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. మెల్బోర్న్ రెనెగాడ్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ని 71,162 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఫైనల్‌కు లక్ష మందికిపైగా ప్రేక్షకులు వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారు. అంతేగాక, బిగ్ బాష్ టోర్నమెంట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు కూడా భారీ స్పందన దక్కింది. మొత్తం మీద సగటున ఒక్కో మ్యాచ్‌ని పది లక్షల మంది చూశారని నెట్‌వర్క్ టెన్ ప్రకటించింది. తమ ఊహకు కూడా అంతని స్థాయిలో ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంపై నిర్వాహకులు సంబరపడుతున్నారు. భవిష్యత్తులో బిగ్ బాష్‌కు మరింత ఆదరణ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.