ఆటాపోటీ

ఫుట్‌బాల్‌కు పిర్లో గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటలీ లెజెండరీ ఫుట్‌బాలర్ ఆండ్రియ పిర్లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం సాకర్‌లో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక సంఘటనల్లో ఒకటి. మిడ్‌ఫీల్డర్‌గా విశిష్ట సేవలు అందించిన అతను కెరీర్ మొత్తం మీద 570 మ్యాచ్‌లు ఆడి, 61 గోల్స్ సాధించాడు. ‘ఫ్రీ కిక్ స్పెషలిస్టు’గా పేరు తెచ్చుకున్న అతను ఇటలీ జాతీయ జట్టుకు 116 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించి, 13 గోల్స్ చేశాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే పిర్లోను దాటుకొని ముందుకు వెళ్లడం ప్రత్యర్థులకు అసాధ్యంగా ఉండేది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకమైన సలహాలు, సూచనలు ఇస్తూ అందరితో కలిసిపోయే 38 ఏళ్ల పిర్లో వివిధ క్లబ్‌ల తరఫున ఆడాడు. బ్రెసికాతో క్లబ్ కెరీర్‌ను ప్రారంభించిన అతను ఇంటర్నేజనేల్, రెగినా, మిలాన్, జువెంటాస్ జట్ల తరఫున ఆడాడు. కెరీర్ చివరిలో న్యూయార్క్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగాడు.