ఆటాపోటీ

బాడ్మింటన్ షెడ్యూల్ భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం ఆటగాళ్లకు భారంగా పరిణమించే అవకాశం ఉంది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఇప్పటికే సర్వీస్ రూల్స్‌ను బీడబ్ల్యూఎఫ్ మార్చేసింది. వచ్చే ఏడాది నుంచి అందరూ ఈ కొత్త సర్వీస్ నిబంధనను అనుసరించి తీరాలి. ఇప్పటివరకూ ఉన్న రూల్స్‌కు భిన్నంగా కొత్త రూల్స్ పుట్టుకురావడంతో, వాటికి అలవాటు పడడం అనుకున్నంత సులభం కాదు. చైనా, జపాన్, ఇండోనేషియా, డెన్మార్క్, మలేసియా తదితర దేశాల్లో, ఏదో ఒక స్థాయిలో అనుసరిస్తున్న కొన్ని నిబంధనలనే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ అనుసరిస్తున్నది. కాబట్టి ఆ దేశాల క్రీడాకారులకు ఈ మార్పుల వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. భారత్‌సహా ఇతర దేశాలకు సర్వీస్ తదితర మార్పులు భారంగానే మారుతాయి. ఈ సమస్య ఇలావుంటే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్ ‘టాప్-15’, డబుల్స్ ‘టాప్-10’ స్టార్లు వచ్చే ఏడాది నుంచి కనీసం 12 టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఫిట్నెస్ లేదా మరే ఇతర సమస్యను సాకుగా చూపించి తప్పించుకోవడానికి వీల్లేదు. ఉద్దేశపూర్వకంగానే కనీస సంఖ్యను పూర్తి చేయలేదన్న అనుమానం వేస్తే, సదరు క్రీడాకారుడు లేదా క్రీడాకారిణిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్ ఇప్పటికే హెచ్చరించింది. విరామం లేని షెడ్యూల్ ఒకవైపు, కనీసం 12 టోర్నీల్లో ఆడి తీరాలన్న నిబంధన మరోవైపు భారత బాడ్మింటన్ స్టార్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నిబంధనల నుంచి ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. వచ్చే నెల 15 నుంచి 21 వరకు మలేసియా ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ వెంటనే, 23 నుంచి 28 వరకు ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ఉంటుంది. వెనువెంటనే, 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఇండియా ఓపెన్ సిద్ధంగా ఉంది. ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్, ఆల్ ఇంగ్లాండ్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలతోపాటు స్విస్ ఓపెన్, స్పెయిన్ సూపర్ సిరీస్, జర్మన్ సూపర్ సిరీస్‌లు జరుగుతాయి. బాడ్మింటన్ ప్లేయర్లకు అంతర్జాతీయ షెడ్యూల్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే, వచ్చే ఏడాది మొత్తంలో దాదాపుగా ప్రతి నెలా ఏదో ఒక టోర్నమెంట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి, ఆరంభంలోనే సాధ్యమైనన్ని ఎక్కువ మేజర్ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా ఆ తర్వాత ఒత్తిడికి గురికాకుండా తప్పించుకోవచ్చు. ప్రారంభంలో కొన్నింటికి గైర్హాజరైతే, చివరిలో ప్రతి టోర్నీలోనూ ఆడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రపంచ బాడ్మింటన్ రంగంలో తమకంటూ ఒక గుర్తింపు సంపాదించిన తర్వాత చాలామంది ప్లేయర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సామాన్యమైంది. ఇష్టం ఉన్నప్పుడు టోర్నీలకు హాజరుకావడం, లేకపోతే వాటినుంచి వైదొలగడం ఆనవాయితీగా మారింది. అందుకే, బీడబ్ల్యూఎఫ్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కొత్త రూల్స్, షెడ్యూల్‌ను అనుసరించి రాణించాలంటే, ఫిట్నెస్‌తోపాటు అంతులేని ఆత్మవిశ్వాసం కూడా అత్యవసరం. బాడ్మింటన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న నిర్ణయాలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇది అద్భుత పరిణామమని, సామాన్యులకూ, టాప్ స్టార్లకూ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని కొంత మంది అంటున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’ లేదా ‘టాప్-15’ స్థాయికి చేరుకున్న తర్వాత, ఎంపిక చేసిన టోర్నీల్లో ఆడడం, రేటింగ్స్‌కోసం చిన్నచిన్న పోటీలను ఎంపిక చేసుకొని, మేజర్ టోర్నీలను విస్మరించడం వంటి అవాంఛిత పరిణామాలకు తెరదించే అవకాశం ఉంటుందని వారి వాదన. అయితే, విరామం లేకుండా సిరీస్‌లు ఆడాల్సి రావడం ఎవరికైనా కష్టమేనని మరి కొంతమంది అంటున్నారు. షెడ్యూల్ చాలాబిజీగా ఉన్నప్పుడు, టోర్నీలను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులను బలవంగా టోర్నీలు ఆడేలా ఒత్తిడి చేయడం లేదా ఆదేశాలు జారీ చేయడమంటే, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వాదనలు ఎలావున్నా, బీడబ్ల్యూఎఫ్ సిద్ధం చేసిన షెడ్యూల్ అధిక శాతం మంది ప్లేయర్లకు భారంగా మారడం ఖాయం. ముందుగానే స్పష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని, దానికి అనుగుణంగా టోర్నీల్లో పాల్గొనడం అత్యవసరం. లేకపోతే, అత్యంత విలువైన రేటింగ్ పాయింట్లను కోల్పోవడమేగాక, బీడబ్ల్యూఎఫ్ ఆగ్రహానికి కూడా గురికావాల్సి వస్తుంద