ఆటాపోటీ

హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది సెప్టెంబర్ 21న కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. వనే్డల్లో హ్యాట్రిక్ సాధించిన 43వ బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను ప్రదర్శించిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 1987 అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో జరిగిన వనే్డలో చేతన్ శర్మ భారత్ తరఫున మొదటి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ప్రతిష్ఠాత్మక కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 1991 జనవరి 4న శ్రీలంకతో జరిగిన వనే్డలో కపిల్‌దేవ్ హ్యాట్రిక్ సాధించాడు. ఇదే మైదానంలో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌ను పూర్తి చేయడం గమనార్హం. అతను వరుస బంతుల్లో మాథ్యూవేడ్, ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్‌ను ఔట్ చేశాడు. హ్యాట్రిక్‌తో అదరగొట్టిన భారత తొలి స్పిన్నర్‌గానూ కుల్దీప్ యాదవ్ రికార్డులకెక్కాడు.