ఆటాపోటీ

అభిమానులకు ధోనీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ఆరంభంలోనే అభిమానులకు మహేంద్ర సింగ్ ధోనీ పెద్ద షాకిచ్చాడు. వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు జనవరి 5న ప్రకటించాడు. భారత్‌కు మొదటి టి-20 వరల్డ్‌కప్‌ను ఆ తర్వాత వరల్డ్ కప్‌ను, చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను అందించిన ధోనీ కెప్టెన్‌గా ఉండడు అనే నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే, ఆటగాడిగా కొనసాగుతానని అతను చేసిన ప్రకటన వారికి కొంత ఊరటనిచ్చింది. అందరూ ఊహించిన విధంగానే, అంతకుముందే టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీకే మిగతా రెండు ఫార్మాట్స్‌లోనూ పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కెప్టెన్‌గా లేకపోయినా, డీఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయడం, ఫీల్డింగ్‌ను సెట్ చేయడం వంటి చర్యలు ధోనీ ఇంకా కెప్టెన్సీ ప్రభావం నుంచి బయటపడలేదని నిరూపిస్తున్నాయి.