ఆటాపోటీ

బుమ్రా పొరపాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జస్‌ప్రీత్ బుమ్రా చేసిన ఒక పొరపాటు టీమిండియాకు చాంపియన్స్ ట్రోఫీని దక్కకుండా చేసింది. బుమ్రా ఓవర్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్ బ్యాట్‌కు తగులుతూ బంతి వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ చేతిలోకి వెళ్లింది. అయితే, అది నోబాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. ఆ తర్వాత అతను దూకుడుగా ఆడి సెంచరీ (114) సాధించాడు. ఫలితంగా పాకిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 338 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన టీమిండియా తీవ్రమైన ఒత్తిడికిలోనై, 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. ఈ ఫైనల్‌ను 180 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్‌కు చాంపియన్స్ ట్రోఫీ లభించింది. నిజానికి ఇంగ్లాండ్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ఆడేందుకు బయలుదేరినప్పుడు టీమిండియాను అంతా హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటే, పాకిస్తాన్‌పై ‘అండర్ డాగ్’ ముద్ర వేశారు. అందుకు తగినట్టుగానే ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. పాకిస్తాన్ చేతులెత్తేసింది. కానీ, రెండు జట్లు ఫైనల్‌లో మరోసారి ఢీకొన్నప్పుడు ఫలితం తారుమారైంది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వంలో భారత్‌ను ఓడించిన పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఫలితం పాక్ అభిమానులను ఆనందంలో ముంచెత్తితే, టీమిండియా అభిమానులకు నిరాశను మిగిల్చింది. భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీని రన్నరప్‌గా ముగించుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు స్వదేశానికి బయలుదేరినప్పుడే, హైదరాబాదీ మిథాలీ రాజ్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు లండన్‌లో కాలుమోపింది. మహిళల చాంపియన్స్ ట్రోఫీలో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతూ ఫైనల్ చేరింది. కానీ, చివరి అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఇంగ్లాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. ఈ ఫలితం నిరాశపరచినప్పటికీ, భారత మహిళల ఆ స్థాయికి చేరడమే అద్భుతమన్నది వాస్తవం. మిథాలీ రాజ్ వనే్డ కెరీర్‌లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు నెలకొల్పడం మరో విశేషం.