ఆటాపోటీ

టీమిండియా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేషనల్స్ చరిత్రలో 350 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను మూడు పర్యాయాలు సమర్థంగా ఛేదించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. 2013 అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాపై 361 పరుగులు, అదే నెల 30న తిరిగి ఆస్ట్రేలియాపైనే నాగపూర్‌లో 351 పరుగులు చేసి భారత్ విజయాలను నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి 15న ఇంగ్లాండ్‌తో పుణేలో జరిగిన మ్యాచ్‌లో 48.1 ఓవర్లలో 7 వికెట్లకు 356 పరుగులు చేసి, మూడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. మరే ఇతర జట్టుకూ సాధ్యంకాని రీతిలో మూడుసార్లు 350 కంటే ఎక్కువ లక్ష్యాలను చేరుకొని వనే్డ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ ఏడాది జూన్ 25న వెస్టిండీస్‌తో జరిగిన వనే్డలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి, ఎక్కువ పర్యాయాలు 300లకు పైగా పరుగులు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును బద్దలు చేసింది. ఆస్ట్రేలియా 95 వనే్డల్లో 300 ప్లస్ పరుగులు చేస్తే, భారత్ 96 వనే్డలతో ఆ రికార్డును అధిగమించింది.