ఆటాపోటీ

రోహిత్ స్పెషల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాట్ కోహ్లీ అందుబాటులో లేనప్పుడు, శ్రీలంకతో జరిగిన వనే్డ, టీ-20 ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు కెప్టెన్ హోదాలో సిరీస్‌లను అందించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. వనే్డల్లో డబుల్ సెంచరీలో స్పెషలిస్టుగా పేరు సంపాదించాడు. ఈ ఫార్మాట్‌లో ఇంతవరకూ ఎనిమిది డబుల్ సెంచరీలు నమోవదుకాగా, వాటిలో మూడు రోహిత్‌వే కావడం విశేషం. మిగతా ఐదు డబుల్ సెంచరీలను బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా/ మహిళా క్రికెటర్), సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్, మార్టిన్ గుప్టిల్, క్రిస్ గేల్ పంచుకుంటున్నారు. లంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో రోహిత్ విజృంభణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పూర్తి సిరీస్‌కు మొట్టమొదటిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన అతను అద్భుత ప్రతిభాపాటవాలు కనబరిచాడు. ఈ ఏడాది మొత్తంమీద నిలకడగా రాణించిన కోహ్లీతో పోల్చడానికి వీల్లేకపోయినా, భారత క్రికెట్‌కు రోహిత్ అందించిన సేవలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతలను భుజాలపై వేసుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా, బ్యాట్స్‌మన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించడాన్ని ఒక అద్భుతంగా పేర్కోవాలి.