ఆటాపోటీ

కోహ్లీదే 2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది కోహ్లీ చేరుకున్న మైలురాళ్లు, నెలకొల్పిన రికార్డులు అనన్యసామాన్యం. అతని సారథ్యంలో టీమిండియా ఒక్క ద్వైపాక్షిక టెస్టు, వనే్డ, టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లను కోల్పోలేదు. కెప్టెన్‌గానేగాక, బ్యాట్స్‌మన్‌గానూ అతను ఈ ఏడాది అత్యున్నత శిఖరాలను చేరుకున్నాడు. 10 టెస్టుల్లో 75.64 సగటుతో 1,059 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో ఐదు శతకాలు ఉన్నాయి. 26 వనే్డల్లో అతను ఆరు శతకాల సాయంతో 1,460 పరుగులు చేశాడు. ఆరు డబుల్ సెంచరీలు చేసిన తొలి కెప్టెన్‌గా అతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం మీద అతను కెరీర్‌లో 63 టెస్టుల్లో 5,268 పరుగులు, 202 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 9,030 పరుగులు సాధించాడు. సచిన్ తెండూల్కర్ మాదిరి సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగిస్తే, అతని రికార్డులన్నింటినీ కోహ్లీ బద్దలు చేయడం ఖాయం.

ఈ ఏడాది భారత క్రికెటర్లు ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. పలు రికార్డులను నమోదు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 8,000 పరుగుల మైలురాయని చేరిన బ్యాట్స్‌మన్‌గా ఈ ఏడాది జూన్ 15న రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తన 175వ ఇన్నింగ్స్‌లో 8వేల పరుగులను పూర్తి చేశాడు. అంతకు ముందు, 2015 ఆగస్టు 26న న్యూజిలాండ్‌తో దర్బన్‌లో జరిగిన వనే్డలో ఈ ఫీట్‌ను సాధించిన ఏబీ డివిలియర్స్ రికార్డును అతను అధిగమించాడు. వరుసగా నాలుగు సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు నెలకొల్పాడు. రెండు కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా, వనే్డల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులు సృష్టించాడు. అదే విధంగా కెప్టెన్‌గా ఎక్కువ సెంచరీలు (12), ఎక్కువ డబుల్ సెంచరీలు (6) చేసిన ఘనత కూడా అతనిదే. అంతేగాక, ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు (11) చేసిన కెప్టెన్‌గానూ మరో రికార్డు నెలకొల్పాడు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 100 స్టంపింగ్స్‌ను పూర్తి చేశాడు. సెప్టెంబర్ మూడున అతను కొలంబోలో శ్రీలంకతో ప్రేమదాస స్టేడియంలో జరిగిన వనే్డలో అకిల ధనంజయను స్టంప్ చేసి, సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఆగస్టు 31న అదే స్టేడియంలో ధోనీ 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వనే్డల్లో అతను ఔట్‌కాకుండా క్రీజ్‌లో నిలవడం అది 73వ సారి. తలా 72 పర్యాయాలు నాటౌట్‌గా ఉండి, రికార్డును పంచుకుంటున్న షాన్ పోలాక్ (దక్షిణాఫ్రికా), చామిందా వాస్ (శ్రీలంక)ను ధోనీ అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్యాలండర్ ఇయర్‌లో అతను అధిరోహించిన శిఖరాలు, సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. ఈ ఏడాది కోహ్లీ పట్టిందల్లా బంగారమే అయింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై టెస్టు సిరీస్‌లను అతను భారత్‌కు అందించాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 2,818 పరుగులు సాధించిన అతని స్కోరులో 11 సెంచరీలు ఉన్నాయి. తాను స్వయంగా రాణిస్తూ, జట్టుకు అద్భుతమైన మార్గదర్శకం చేస్తున్న కోహ్లీని ఈ ఏటి మేటి కెప్టెన్‌గా పేర్కోవాలి. ఫిట్నెస్‌లో అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తున్న అతను కఠోర పరిశ్రమకు మారుపేరయ్యాడు. అందుకే, అద్వితీయ విజయాలు అతనికి పాదాక్రాంతమవుతున్నాయి.
వనే్డ ఫార్మాట్‌లో కోహ్లీ సంచలనాలు ఇంగ్లాండ్‌పై సాధించిన శతకంతో మొదలయ్యాయి. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతోపాటు, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై అదే దూకుడును కొనసాగించాడు. ఈ ఏడాదే అతను వనే్డల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఇప్పుడు అతని ఖాతాలో మొత్తం 32 వనే్డ శతకాలున్నాయి. 30 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ను కోహ్లీ మూడో స్థానానికి నెట్టేశాడు. ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఒక్కడే, 49 సెంచరీలతో, కోహ్లీ కంటే ముందున్నాడు. టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్‌తో కలిసి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అతనికి ఐదో స్థానం దక్కుతుంది. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 12, కుమార సంగక్కర 11, బ్రియాన్ లారా 9 డబుల్ సెంచరీలతో ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. వాలీ హామండ్, సనత్ జయసూర్య చెరి 7 డబుల్ సెంచరీలు సాధించి, నాలుగో స్థానంలో ఉన్నారు. సచిన్, సెవాగ్, మర్వన్ అటపట్టు, జావేద్ మియందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌తో కలిసి కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే, కెప్టెన్ హోదాలో అత్యధిక టెస్టు డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు అతనికే దక్కుతుంది. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ 610 పరుగులు సాధించాడు. ఒకే టెస్టు సిరీస్‌లో ఆరు వందలకుపైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా అతను చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకుముందు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. అయితే, వారిద్దరూ రెండేసి పర్యాయాలు ఆ ఫీట్‌ను ప్రదర్శించడం గమనార్హం.
కాగా, ఈ సిరీస్‌లోనే కోహ్లీ వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించాడు. వినోద్ కాంబ్లీ తర్వాత, టెస్టుల్లో రెండు వరుస డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గానూ అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. మొత్తం మీద ఈ ఏడాది కోహ్లీ అనేకానేక రికార్డులు నెలకొల్పాడు. అత్యున్నత ప్రమాణాలను అందుకున్నాడు. వ్యక్తిగత జీవితంలోనూ కోహ్లీకి ఈ ఏడాది చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. చిరకాల స్నేహితురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను అతను ఇటలీలో వివాహం చేసుకున్నాడు. చాలాకాలం కొనసాగిన వీరి ప్రేమాయణం చివరికి సుఖాంతమైంది.

- మైత్రేయ