ఆటాపోటీ

క్షణాల్లో నిద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాకారులు, ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడితోనే ఉంటారు. వారు కంటినిండా నిద్ర కూడా పోలేదు. అందుకే, సమయం దొరికితే చాలు క్లబ్‌లకు, పబ్‌లకు వెళ్లి, పీకలదాకా తాగేస్తారు. అప్పటికీ వారికి నిద్ర రావడం కష్టమే. కానీ, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఆటగాడు రహీం స్టెర్లింగ్ మాత్రం వీరికి పూర్తి భిన్నంగా ఉంటాడు. క్షణాల్లో నిద్రపోవడం అతని అలవాటు. చివరికి ట్రైనింగ్ కోసం హోటల్ నుంచి గ్రౌండ్ వరకూ వెళ్లే కొన్ని నిమిషాలనూ అతను నిద్రకే వాడుకుంటాడు. అందుకేనేమో, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లోనే అతను వాట్‌ఫోర్డ్‌తో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆరంభమైన 38వ సెకనులోనే గోల్ సాధించి రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస మ్యాచ్‌ల్లో, చివరి క్షణాల్లో గోల్స్ సాధించి మాంచెస్టర్ సిటీని విజయపథంలో నడిపించాడు. అతని అద్భుత ప్రదర్శనకు ఈ నిద్రే కారణమేమో!