ఆటాపోటీ

వారసలొస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్‌లో వారసులు దూసుకొచ్చేస్తున్నారు. అండర్-19 వరల్డ్ కప్‌లో తమను తాము నిరూపించుకొని, జాతీయ జట్టులో స్థానంకోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో జరిగే అండర్-19 వరల్డ్ కప్‌లో చాలామంది దృష్టి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కుమారుడు ఆస్టిన్ వాపై కేంద్రీకృతమంది. 2016 అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజేయంగా 122 పరుగులు చేసి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మాదిరి అన్ని విభాగాల్లోనూ రాణించాలన్నది తన ధ్యేయమంటున్న ఈ యువ ఆటగాడికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, దివంగత ఫిల్ హ్యూస్ అంటే అమితమైన ఇష్టం. టెక్నిక్‌లో హ్యూస్‌ను మించినవారు లేరని ఆస్టిన్ అభిప్రాయం. తన తండ్రి స్టీవ్ వా ఆట కూడా తనకు ఇష్టమేనని స్పష్టం చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మఖయా ఎన్తినీ కుమారుడు థాండో ఎన్తినీ కూడా స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నాడు. ఎడమచేతి వాటం మీడియం పేసర్‌గా రాణిస్తున్న ఈ యువ ఆటగాడు బ్యాటింగ్ మాత్రం కుడి చేత్తో చేస్తాడు. విరాట్ కోహ్లీని అభిమానించే థాండోకు అందరికంటే ముందు తన తండ్రి మఖయా అంటేనే ఇష్టం. ఈ విషయాన్ని అతను కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. చిన్నతనం నుంచి తన తండ్రి ఆటను చూసే ప్రభావితుడినయ్యానని, అతనికి సిసలైన వారసుడిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నానని చెప్తున్నాడీ ఆల్‌రౌండర్. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్న మరో ఆటగాడు విల్ సదర్లాండ్. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కుమారుడే విల్. ఆల్‌రౌండర్‌గా లిస్ట్ ‘ఏ’ మ్యాచ్‌లు ఆడిన అనుభవం జేమ్స్‌కు ఉంది. అతని మాదిరిగానే ఆల్‌రౌండర్‌గా సేవలు అందించాలనుకుంటున్న విల్‌కు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అడుగుజాడల్లో నడవాలన్నది చిరకాల కోరిక. అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను తన ప్రతిభను నిరూపించుకోవడానికి అసలుసిసలైన వేదికగా ఎంచుకున్నాడు. క్రికెట్‌లో వారసులుగా వచ్చినవారిలో కొంతమందే పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తే, ఎక్కువ మంది అంచనాలకు తగినట్టు ఆడలేక, విమర్శలు ఎదుర్కొన్నారు. సమర్థమైన కెరీర్‌ను కొనసాగించలేకపోయారు. అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడే ముగ్గురు వారసులు ఏ కోవకు చెందుతారో చూడాలి.