ఆటాపోటీ

వార్ డాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా పోటీలు యుద్ధాన్ని తలపిస్తాయి... నిజమే.. కానీ, యుద్ధాలతో క్రీడలకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే, లండన్‌లోని ట్వికెన్‌హామ్ స్టేడియంలో సుమోవా రగ్బీ జట్టు వార్ డాన్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరుస పరాజయాలతో అల్లాడుతున్న ఈ జట్టు ఆటగాళ్లలో పౌరుషాన్ని నింపాలంటే, రొటీన్ ఎక్సర్‌సైజ్ సరిపోదని నిర్ణయానికి వచ్చిన అధికారులు వార్ డాన్స్ చేసి తీరాలని ఆదేశించారు. కొన్ని దేశాల్లో యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు ఈ డాన్స్‌తోనే ఉత్తేజం పొందుతారు. ఉద్వేగంతో, ఉత్సాహంతో శత్రు సైన్యాన్ని చీల్చిచెండాడతారు. తమ ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో ప్రత్యర్థులపై దాడులకు దిగి, విజయాలు సాధించాలన్నది సుమోవా క్లబ్ అధికారుల ఆశ. ఇంతకీ ఈ వార్ డాన్స్ పేరు ఏమీటో తెలుసా? ‘శివ తవూ’ అని పిలిచే ఈ డాన్స్ శివతాండవం నుంచి పుట్టిందేమో!