ఆటాపోటీ

బోల్ట్‌తో పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే రికార్డు ఉసేన్ బోల్ట్ సొంతం. 100 మీటర్ల స్ప్రింట్‌తోపాటు 200 మీటర్ల పరుగులోనూ ప్రపంచ రికార్డులు అతని పేరుమీదే ఉన్నాయి. అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, ఫుట్‌బాలర్‌గా తన కెరీర్‌ను తీర్చుదిద్దుకుందామని అనుకుంటున్న బోల్ట్‌కు గట్టిపోటీదారుగా అతని ప్రాణమిత్రుడు లియాన్ బెయిలీ ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ట్రాక్స్‌పై బోల్ట్ ఎంత వేగంగా పరిగెడతాడో, ఫుట్‌బాల్ మైదానంలో బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత బెయిలీ కూడా అంతేవేగంతో ముందుకు దూసుకెళతాడు. తక్కువ దూరాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, బోల్ట్ కంటే వేగంగా బెయిలీ పరిగెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. అథ్లెటిక్స్‌లో తిరుగులేని రారాజుగా నిలిచిన బోల్ట్‌కు ఫుట్‌బాల్ రంగంలో సవాళ్లు తప్పకపోవచ్చు. ప్రస్తుతం బొరష్యా డార్ట్‌మండ్ ఆటగాళ్లతో కలిసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న బోల్ట్ ఏదో ఒక క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంటే, 20 ఏళ్ల బెయిలీతో పోటీ తప్పకపోవచ్చు. మైదానంలో వీరిద్దరిలో ఎవరు వేగంగా పరుగెడతారన్నది ఇప్పుడు సాకర్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.