ఆటాపోటీ

గ్రేస్ ‘ది గ్రేట్’ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు పదుల వయస్సులో క్రికెట్ ఆడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడం అనేది ఎవరూ ఊహించలేని విషయం. అలాంటి అరుదైన రికార్డు విలియమ్ గిల్బర్ట్ గ్రేస్ పేరిట ఉంది. డబ్ల్యుజి గ్రేస్‌గా అందరికీ సుపరచితుడైన అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 54,896 పరుగులు చేశాడు. 2,864 వికెట్లు కూల్చాడు. ఈ స్థాయి ప్రమాణాలను ఇప్పటివరకూ ఎవరూ అందుకోలేదు. ఇంగ్లాండ్‌కు చివరిసారి కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు అతని వయసు 50 సంవత్సరాల 320 రోజులు. ఈ రోజుల్లో నలభై ఏళ్ల తర్వాత ఎవరూ టెస్టు క్రికెట్ ఆడడం లేదు. కాబట్టి, ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరూ అధిగమించలేరనడంలో సందేహం లేదు