ఆటాపోటీ

అధికారులే అధికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే బృందంలో ఏ దేశమైనా ఎక్కువ సంఖ్యలో అథ్లెట్లను, సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో అధికారులను పంపుతుంది. కానీ, రియో ఒలింపిక్స్‌కు వెళ్లే పాకిస్తాన్ బృందంలో అథ్లెట్ల కంటే అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయిన నేపథ్యంలో, ఈసారి పాక్ తరఫున కేవలం ఏడుగురు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. వీరితో పాటు మరో 11 మంది అధికారులు రియో వెళతారు. నిజానికి ఏడుగురు అథ్లెట్లు కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనే కనీసం అర్హతను సంపాదించలేదు. అయితే, వైల్డ్‌కార్డ్ ఎంట్రీపై వారు రియోకు ప్రయాణమవుతున్నారు. ఒలింపిక్స్‌లో పాక్ జట్టు ఇప్పటి వరకూ 10 పతకాలను సాధించింది. వాటిలో ఎనిమిది హాకీలో సంపాదించుకున్నవే కావడం విశేషం. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ హాకీలో రజత పతకాన్ని గెల్చుకున్న పాకిస్తాన్ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకుంది. 1964 (టోక్యో)లో రజతం, 1968 (మెక్సికో సిటీ)లో స్వర్ణం, 1972 (మ్యూనిచ్)లో రజతం, 1976 (మాంట్రియల్)లో కాంస్యం, 1984 (లాస్ ఏంజిల్స్)లో స్వర్ణం, 1992 (బార్సిలోనా)లో కాంస్య పతకాలను సాధించింది. హాకీని మినహాయిస్తే ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు కేవలం రెండు పతకాలు లభించాయి. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ వెల్టర్‌వెయిట్ విభాగంలో మహమ్మద్ బషీర్ కాంస్య పతకాన్ని సాధించాడు. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో సయ్యద్ హుస్సేన్ షా పురుషుల బాక్సింగ్ మిడిల్‌వెయిట్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈసారి ఒలింపిక్స్‌కు హాకీ జట్టు అర్హత సంపాదించలేదు. అదే విధంగా బాక్సింగ్, రెజ్లింగ్ విభాగాల్లో పాకిస్తాన్ పోటీ పడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా రియోకు ఎంపికైన ఏడుగురు అథ్లెట్లలో స్విమ్మర్లు లియానా స్వాన్, హారిస్ బ్రాండే విదేశాల్లో స్థిరపడ్డారు. జూడోకా షా హుస్సేన్ టోక్యోలో నివాసం ఉంటున్నాడు.

వీరితోపాటు షూటర్లు గులాం ముస్త్ఫా, మిన్హాల్ సొహైల్, మరో ఇద్దరు అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌లో పాక్ తరఫున బరిలోకి దిగుతారు. ఈ ఏడుగురు అథ్లెట్లతో ఏకంగా పదకొండు మంది అధికారులు ఒలింపిక్స్‌కు బయలుదేరడం విచిత్రం. పతకాలపై ఆశ లేకున్నా, పోటీపడుతున్న దేశాల జాబితాలో కనిపించేందుకే వీరిని పాకిస్తాన్ సర్కారు రియోకు పంపుతున్నది.