జాతీయ వార్తలు

పూణే ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఉద్యోగినిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, డిసెంబర్ 29: ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై ఆదివారం అత్యాచారం జరిగింది. ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోనే జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి ఇద్దరు హౌస్‌కీపింగ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. పరితోశ్ బాగ్, ప్రకాశ్ మహాడిక్‌లను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్‌లోని లేవెట్రీలో ఈ నెల 27 ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది. ఒకడు అత్యాచారం చేస్తుండగా మరొకడు తన మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే ఫోన్ క్లిపింగ్ బయటపెడతామని దుండగులు హెచ్చరించారు. బాధితురాలు పూణే ఇన్ఫోసిస్ కేంటీన్‌నో క్యాషియర్‌గా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు సహకరిస్తామని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సంస్థ డిమాండ్ చేసింది.