తెలంగాణ

హడలెత్తిసున్న ఎటిఎం దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్‌లో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
వెంబడించిన పోలీసులు, మరోమారు తప్పించుకున్న వైనం
బోధన్, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లాలో పక్కారెక్కీతో ఎటిఎం కేంద్రాలలో దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన దోపిడీ దొంగలు మహారాష్టల్రో సైతం ఇదే కోవలో దోపిడీలకు పాల్పడి మరాఠా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. బోధన్ డివిజన్‌లోని కోటగిరి, వర్ని మండలాలలో గల రెండు గ్రామాలలో మూడు ఎటిఎం కేంద్రాలలో దోపిడీకి పాల్పడి 40 లక్షల రూపాయలను దోచుకెళ్లిన దొంగల ముఠా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఔరంగాబాద్‌లోని ఓ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం చేసింది. ఇక్కడ కూడా బ్యాంకులోని నగదు గదిలోనికి చొచ్చుకుని వెళ్లి దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన దొంగల ముఠా పోలీసుల రాకతో అప్రమత్తమై ఓ వాహనంలో అక్కడి నుండి పరారయ్యింది. పోలీసులు వెంబడించడంతో అక్కడ ఓ ద్విచక్ర వాహనాన్ని వదిలి వెళ్లినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని ఔరంగాబాద్ పోలీసులు జిల్లాలోని అన్ని ఠాణాల పోలీసులకు సమాచారం అందించినప్పటికీ దొంగల ముఠా నాగ్‌పూర్ పట్టణానికి చేరుకుని అక్కడ ఎటిఎంలలో దోపిడీలకు పాల్పడి దాదాపు 23లక్షల రూపాయలను దోచుకు పోయారు. మహారాష్టల్రోని ఎటిఎం కేంద్రాలలో గల సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే దోపిడీకి వచ్చిన దొంగలు గ్యాస్ సిలిండర్ ద్వారా కట్టర్‌తో ఎటిఎం మిషన్‌లోని నగదు బాక్సులను మాత్రమే కట్ చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. అక్కడ జరిగిన దోపిడీ, నిజామాబాద్ జిల్లాలో జరిగిన దోపిడీలు ఒకే విధంగా ఉండటంతో ఖచ్చితంగా ఇక్కడ దోపిడీకి పాల్పడిన ముఠాయే మహారాష్టల్రో కూడా పాల్పడినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మహారాష్టక్రు చెందిన కొందరు పోలీసు అధికారులు మహారాష్టక్రు ఆనుకుని ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కొందరు పోలీసు అధికారులతో మాట్లాడి తమ వద్ద జరిగిన దోపిడీ గురించి తెలియచేశారు. రెండు రాష్ట్రాలలో దోపిడీలు వరుసగా, ఒకే విధంగా జరుగడంతో తెలంగాణ, మహారాష్టల్రలో ఒకే ముఠా దోపిడీలకు పాల్పడి ఉండవచ్చని రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. బోధన్ ఏరియాలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా మహారాష్టక్రు చెందినదనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. కానీ నేడు అదే ముఠా మహారాష్టల్రో కూడా దోపిడీకి పాల్పడటంతో మరాఠా పోలీసులు ఈ ముఠా మహారాష్టక్రు చెందింది కాదని స్పష్టం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మరో రాష్ట్రానికి చెందిన దోపిడీ దొంగలే ఇటువంటి అంతర్ రాష్ట్ర దొంగతనాలకు పాల్పడతారని గత నేరాల ఆధారంగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. దోపిడీ దొంగతనాలలో ఆ రాష్ట్ర ముఠాలు జాతీయ స్థాయిలోనే పోలీసులకు సవాల్ విసిరిన సంఘటనలు అనేకం ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ఔరంగాబాద్‌లో దొంగలు వదిలి వెళ్లిన బైక్ ఆధారంగా కొంత సమాచారం మరాఠా పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఆధారాలతో మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ కోటగిరి, వర్ని మండలాలలో జరిగిన దోపిడీలకు సంబంధించి ఇక్కడి ఐడి పార్టీ బలగాలు, సిసిఎస్ పోలీసులు, కొందరు అధికారులు సైతం మహారాష్టల్రోనే మకాం వేసి రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల కోసం గాలిస్తున్న తరుణంలో మహారాష్టల్రో దోపిడీ దొంగల ముఠా రెండు ముఖ్యమైన పట్టణాలలో ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడ్డారు.