క్రైమ్/లీగల్

గుర్తుతెలియని శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, మార్చి 16 : మండల పరిధిలోని చందన గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని పొలాల్లో వృద్ధుడి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ కత్తిశ్రీనివాసులు తెలిపారు. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో సిబ్బందితో వెళ్లి శవాన్ని పరిశీలించినట్లు తెలిపారు. బుధవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడానికి వచ్చిన వృద్ధుడు తనది నంద్యాల అని, కుమారుడు అన్నం పెట్టడం లేదని చెప్పి భోజనం తిని వెళ్లాడని స్థానికులు తెలిపారన్నారు. వృద్ధుడికి గెడ్డ ఉన్నందున ముస్లింగా గుర్తించామన్నారు. వయస్సు 60 సంవత్సరాలు ఉండి, తెల్ల లుంగీమాత్రమే ధరించి ఉన్నాడని తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటో బోల్తా.. కూలీ మృతి
పెద్దవడుగూరు, మార్చి 16 : మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిలో మిడ్తూరు బ్లూమూన్ హోటల్ వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడిన వలస కూలీ పెద్దక్క (55) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే పామిడి మండలానికి చెందిన వలస కూలీలు 9మంది బెంగుళూరులో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని శుక్రవారం బెంగుళూరు నుంచి వచ్చి గుత్తి రైల్వేస్టేషన్‌లో స్వగ్రామానికి వెళ్లడానికి 9 మంది ఒకే ఆటో ఎక్కారు. అయితే మిడ్తూరు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి డివైజర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలుకాగా, పెద్దక్కకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పెద్దవడుగూరు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
బెళుగుప్ప, మార్చి 16 : మండల కేంద్రానికి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాబు (30) మృతి చెందాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తగ్గుపర్తి గ్రామానికి చెందిన తిమ్మప్ప కుమారుడు బాబు, రోషప్ప కుమారుడు వెంకటేశులు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి వెళ్తుండగా బెళుగుప్ప దాటిన తర్వాత వేర్‌హౌస్ వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో ఎస్‌ఐ నాగస్వామి ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలపాలైన బాబు వెంకటేశ్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తన వాహనంలో తరలించారు. అయితే బాబు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.