క్రైమ్/లీగల్

చేనేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఆగస్టు 9 : అప్పులబాధ తాళలేక పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన చేనేత కార్మికులు నాగోజీ (32) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నాగోజి కూలిమగ్గం నేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అయితే నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ విధిలేక ఆరోగ్యం క్షీణించినా మగ్గం నేస్తూ కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. ఓవైపు అప్పులు పెరిగిపోవడం, మరోవైపు వృత్తి రాబడి తగ్గిపోవడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అలేఖ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
అమరాపురం, ఆగస్టు 9 : మండల పరిధిలోని ఉప్పార్లపల్లికి చెందిన రైతు పాండురంగప్ప పొలంలో స్టార్టర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యశోదా (47) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అమరాపురంకు చెందిన విద్యుత్ మెకానిక్ యశోద గురువారం ఉదయం ఉప్పార్లపల్లికి స్టార్టర్ మరమ్మత్తు కోసం వెళ్లాడు. పొలంలో స్టార్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య పుట్టరంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపారు.

చోరీ కేసులో నిందితురాలి అరెస్టు
* 8 తులాల బంగారు నగలు స్వాధీనం
గుంతకల్లు, ఆగస్టు 9 : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో చోరీకి పాల్పడిన నిందితురాలు ఉదయగిరి చంద్రమ్మను అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ రాజా తెలిపారు. గురువారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మత్తు మందు ప్రయోగం చేసి బంగారు నగలు అపహరించే ఉదయగిరి చంద్రమ్మను క్రౌన్ టాకీస్ సమీపంలోని రోడ్డులో అరెస్టు చేసినట్లు తెలిపారు. తిరుపతి సమీపంలో అవిళాలకు చెందిన ఉదయగిరి చంద్రమ్మ ఈమధ్యకాలంలో విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన వృద్ధురాలు తమ్మినేని లక్ష్మిని బస్టాండ్‌లో పరిచయం చేసుకుని కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి బ్యాగులో ఉన్న నగలతో ఉడాయించిందన్నారు. అదేవిధంగా 11 మే 2018న కే.లక్ష్మి తన ఆరేళ్ల కూతురుని లగేజీకి కాపలా పెట్టి సమీపంలోని మూత్రశాలకు వెళ్లగా చంద్రమ్మ లగేజీని కాజేసి అందులోని బంగారు నగలను అపహరించిందన్నారు. ఈ ఘటనలపై బస్టాండ్‌లో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితురాలిపై కర్నాటకలోని బళ్లారి, ఒంగోలులో పోలీస్‌స్టేషన్‌లో చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. చంద్రమ్మను కోర్టుకు హాజరు పరుచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై చాంద్‌బాషా, ఎఎస్సై తిరుపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.