క్రైమ్/లీగల్

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, సెప్టెంబర్ 9: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మంజుల అనే విద్యార్థిని ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై బుక్కరాయసముద్రం పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంఘాలప్ప, నాగలక్ష్మిల 3వ కుమార్తె అయిన మంజుల యస్.ఆర్.ఐ.టి కళాశాలలో విద్యనభ్యసిస్తోంది. అయితే శనివారం సాయంత్రం కళాశాల ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది గమనించి చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లుకు మా కూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని, ముందుగా కడుపునొప్పితో భాదపడుతూ మందు తాగిందని, ఉదయానే్న చికిత్స పొందుతూ మృతి చెందిందని కళాశాల వారు తెలిపారన్నారు. ఇందుకు సంబంధించిన నిజానిజాలను తేల్చి మా కుటుంబానికి న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు బుక్కరాయసముద్రం పోలీసులు తెలియపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరులు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వివాహిత ఆత్మహత్య
సోమందేపల్లి, సెప్టెంబర్ 9 : మండల పరిధిలోని నడింపల్లి రైల్వేట్రాక్ వద్ద వివాహిత రమాదేవి (30) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సోమందేపల్లి గీతానగర్‌కు చెందిన రామాంజిచారి, రమాదేవి భార్యభర్తలు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన రమాదేవి ఆదివారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

క్వారీలో వ్యక్తి మృతి
చిలమత్తూరు, సెప్టెంబర్ 9 : మండల పరిధిలోని యగ్నిశెట్టిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో జరిగిన ప్రమాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీల్‌కుమార్ పాటిల్ మృతి చెందినట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్న క్వారీలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో బండలను పేల్చేందుకు అవసరమైన తూటాలను అమర్చి కొండపై నుండి దిగుతుండగా సునీల్‌కుమార్ పాటిల్ ప్రమాదవ శాత్తు కిందకు పడి తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.