క్రైమ్/లీగల్

రెండు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం - 22మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ/బెళుగుప్ప, సెప్టెంబర్ 19: నియోజకవర్గంలోని రెండు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున పిచ్చికుక్క వీరంగం చేసింది. పిచ్చికుక్క దాడి చేసిన సంఘటనలో దాదాపు 22 మంది గాయపడిన సంఘటనకు సంబందించిన వివరాలిలా వున్నాయి. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా వున్నట్లు, ఉరవకొండ మండలం వై రాంపురం గ్రామానికి చెందిన అంజనేయులు, అక్కమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెళుగుప్ప మండల పరిధిలోని రామసాగరం గ్రామంలో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఏడు మందిని గాయపరిచింది. గ్రామస్థులు అందించిన వివరాల మేరకు రామసాగరం చెందిన వెంకటరమణ, నాగిరెడ్డి, హనుమంతు రెడ్డి, నాగేంద్ర, అరుణ్‌కుమార్ అనే వ్యక్తులపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ఒక్కసారిగా పిచ్చికుక్క కుక్కలపై దాడి చేస్తూ వరుసగా అడ్డం వచ్చిన ఏడుమందిని గాయపరిచింది. అంతకుముందు ఉరవకొండ మండలంలోని రాంపురంలో సుమారు 15 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటనలో లింగమ్మ, ఎర్రిస్వామి, అక్కమ్మ, ఆంజనేయులు, రేణుకలు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం ఉదయం రామసాగరంలో అదే కుక్క దాడికి పాల్పడిందని గ్రామస్థులు తెలిపారు. కల్యాణదుర్గం, అనంతపురం ప్రభుత్వాసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ, సెప్టెంబర్ 19: పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం వుంటున్న నారాయణ స్వామి(45) మంగళవారం రాత్రి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళ లేక జీవితంపై విరక్తి చెందిన నారాయణస్వామి ఇంటిలో విష గుళికలు మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీన్ని గమనించిన బాధితున్ని చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జనార్ధన్‌నాయుడు తెలిపారు.

గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య
కదిరి, సెప్టెంబర్ 19: మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో ఎంవీఐ కార్యాలయం ఎదురుగా గుర్తుతెలియని 35 సంవత్సరాల యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని చూసిన కుటాగుళ్ల వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికెళ్లి పోలీసులు పరిశీలించగా, మద్యం బాటిల్, శీతలపానీయంలో విష గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నాయి.