క్రైమ్/లీగల్

ఈతకు వెళ్ళి విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, సెప్టెంబర్ 22 : పుట్టపర్తి పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన యశ్వంత్ (12) సమీపంలోని హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లాడు. 7వ తరగతి చదువుతున్న యశ్వంత్ నీట మునిగి మృతి చెందడంతో సమీపంలోని ప్రజలు గుర్తించారు. ఈతకు వెళ్ళిన ఒడ్డుకాడ చెప్పులు, బట్టలు ఉండడాన్ని గమనించి వెతకడం మొదలుపెట్టారు. నీటిలో మునిగిన యశ్వంత్ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఆటో బోల్తా - నలుగురికి గాయాలు
ఉరవకొండ, సెప్టెంబర్ 22: ఉరవకొండ పట్టణ శివారు ప్రాంతం 42వ జాతీయ రహదారిలో శనివారం ఆటో బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటక ప్రాంతం బళ్లారి నుండి అనంతపురంకు బయలుదేరిన ఆటో శనివారం ఉదయం పట్టణ శివారు ప్రాంతం వ్యవసాయ మార్కెట్ యార్డు చెక్‌పోస్టు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మల్లిఖార్జున, రేణుకా, శివ, నవీన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వైద్యం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ, సెప్టెంబర్ 22: మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామి శనివారం విషపు గులికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వన్నూరుస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితిలో పడివుండగా గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తరలించారు. యువకుని ఆత్మహత్యాయత్నానికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కారు బోల్తా ఇద్దరికి గాయాలు
కళ్యాణదుర్గం, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని గోళ్ల మారెమ్మ గుడి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, మారుతీలు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వస్తుండగా గోళ్ల సమీపంలో వున్న మారెమ్మ గుడి వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న గుంతలో పడిపోయింది. దీంతో కారులో వున్న శ్రీనివాసులు, మారుతీలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి 108కు సమాచారం ఇవ్వడంతోపాటు, వారు వచ్చేలోగా తీవ్రంగా గాయపడిన వారిని కారు నుంచి బయటకు తీశారు. కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించి, చికిత్సలు అందించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.