అనంతపురం

అంగరంగ వైభవంగా కుళ్లాయి స్వామి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, సెప్టెంబర్ 22 : గూగూడు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే ఆలయ పరిసరాల వీధులన్నీ భక్తుల సందడి కనిపించింది. శనివారం కుళ్లాయి స్వామి పీర్ల సముదాయం అగ్నిగుండం ప్రవేశం తిలకించడానికి సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. వేకువజామున స్వామివారి అగ్నిగుండ ప్రవేశం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కుళ్లాయి స్వామి నామస్మరణం..గోవింద నామపారాయణంలో ఆ ప్రాంతం మార్మోగింది. వేకువజామున 3 గంటలకు పీర్ల సముదాయం గ్రామోత్సవం ప్రారంభమైంది. గూగూడు గ్రామంలోని వడ్డెర వీధి, ఎగువ వీధి, దిగువ వీధి, రెడ్డివారి వీధి, దళిత కాలనీల్లో వందలాది మంది భక్తులు మొక్కుబడులు తోర్చుకోవడానికి సాష్టాంగ ప్రమాణాలు చేశారు. ఉదయం 6 గంటలకు కుళ్లాయి స్వామి పీర్ల సముదాయం అగ్నిగుండం వద్ద చేరుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప, ముజావర్ల ఫాతెహ పూజలు పూర్తి చేయగానే..మొక్కుబడి ఉన్న భక్తులు అగ్నిగుండంలో నడుచుకుంటూ వెళ్లారు. మరికొందరు భక్తులు అగ్నిగుండంలో కొన్ని క్షణాలు నిలిచి గోవింద నామస్మరణం చేశారు. సుమారు అరగంటపాటు జరిగిన కార్యక్రమాన్ని తిలకించిన వారంతా ఇక ఈ యేడాదికి ఇది చాలు జన్మధన్యం అయింది స్వామి నీ కరుణా కటాక్షాలుంటే మళ్లీ వచ్చే యేడాది వస్తామంటూ మొక్కుకొని అగ్నిగుండం వద్ద బూడిదను భక్తితో స్వీకరించి స్వగ్రామాలకు తిరుగు ముఖం పట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవం సాఫీగా జరిగిపోవడంతో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
కన్నుల పండువగా కుళ్లాయిస్వామి అగ్నిగుండ ప్రవేశం
స్వస్తిశ్రీ విళంబి నామ సంవత్సర శుద్ధ త్రమోదశి గ్రామోత్సవం, అగ్నిగుండం ప్రవేశం తిలకించడానికి వచ్చిన భక్తులతో శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు అగ్నిగుండం వద్ద, వీధులు, మేడలు, మిద్దెలు కిక్కిరిసిపోయాయి. కుళ్లాయి స్వామి పీర్ల ఊరేగింపు శరణహోష, గోవింద, అల్లా ఉక్చర్, సావుసేన్ ఉద్దీన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రంగురంగుల పూలు, నగషీల పట్టు వస్త్రాలు, స్వర్ణహారాలు వెండి గొడుగులతో అలంకరించిన పీరును కుళ్లాయిస్వామి వంశీకులు ఉపవాస దీక్షతో ఎత్తుకున్నారు. కొబ్బరి దివిటీల వెలుగులో ఊరేగింపు జరిపారు. స్వామివారి సేవకులు అగ్నిగుండంలోని నిప్పులను చదునుగా పరిచారు. పీర్ల సముదాయం ఎదుట పీర్లమకాన్ ప్రధాన అర్చకులు హుస్సేనప్ప ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో ఫాతియా మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ముల్లాసాహెబ్ నిప్పులపై నడిచారు. ఆయన వెనుకనే స్వామి భక్తుల గోవిందా గోవిందా అంటూ మండుతున్న నిప్పుల్లో నడిచారు. పీర్లునడవగానే ఆఖరున కుళ్లాయిస్వామి అగ్నిగుండం ప్రవేశించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అగ్నిగుండ ప్రవేశానికి వీలుగా నిప్పులను చదునుపరుస్తున్న సమయంలో పోలీసులు కూడా అదుపుచేయని పరిస్థితి నెలకొంది.
యథేచ్ఛగా జంతు బలులు
గూగూడు కుళ్లాయి స్వామి మొహర్రం బ్రహోత్సవాల సందర్భంగా శనివారం జంతుబలులు యథేచ్ఛగా సాగాయి. కుళ్లాయిస్వామి పీర్ల సముదాయం అగ్నిగుండ ప్రవేశం అనంతరం మొక్కుబడి కోసం పొట్టేలు, మేకలు, కోళ్లు కందూరి బలి ఇచ్చేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇస్లాం మత సాంప్రదాయ పద్ధతిలో కల్మా చదివి హలాల్ చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు చేతిలో చురకత్తిపట్టి వందలాది మూగజీవాల గొంతులను కోశారు.

బాలవికాస్ స్కూల్‌లో హిందీ దివాస్
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22: నగరంలోని శ్రీ సత్యసాయి బాలవికాస్ స్కూల్‌లో శనివారం హిందీ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. హిందీ దివాస్‌ను పురస్కరించుకుని స్కూల్‌లోని విద్యార్థులకు హిందీలోని వివిధ పోటీలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పొలం రంగారెడ్డి మాట్లాడుతూ హిందీ ప్రతి ఒక్కరు నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా వెళ్లి రావచ్చునని తెలిపారు. హిందీ భాష దేశంలో ప్రాముఖ్యత కల్గివుందన్నారు. అనంతరం విద్యార్థులకు హిందీ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేసారు.