అనంతపురం

ప్రత్యేక హోదా కోసం నేడు జాతీయ రహదారుల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర ప్రజలను మోసగించిన కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను నిరసిస్తూ నేడు జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టనున్నట్లు సీపీఎం రాయలసీమ సబ్‌కమిటీ కన్వీనర్ ఓబుళు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కోసం సీపీఎం చేపట్టిన రహదారుల దిగ్బంధంను జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. నేడు చేపట్టనున్న ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

దివ్యాంగులకు సర్ట్ఫికెట్ల పంపిణీ
అనంతపురం కల్చరల్, మార్చి 21: సమర్థనమ్ ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ వారి సహాయ సహకారములతో శిక్షణ పూర్తి చేసుకున్న దివ్యాంగులకు సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. లైలీ హుడ్ సెంటర్‌ను ఏర్పాటుచేసి అందులో దివ్యాంగులకు, సకలాంగులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బుధవారం ఐఎంఏ హాలులో జరిగిన కార్యక్రమంలో సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా అనుపమ, బీకే.మహంతేష్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమర్థనమ్ ట్రస్ట్ వికలాంగులైన యువతకు వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధికి, జీవనోపాధిల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దీని ద్వారా 223 మంది యువతీ యువకులు శిక్షణ పొంది 111 మంది ఉద్యోగ అవకాశాలు పొందినట్లు తెలిపారు.

విద్యార్థులకు బహుమతుల ప్రదానం
అనంతపుసరం కల్చరల్, మార్చి 21: 50వ జాతీయ గ్రంథాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా విజయవాడలో ఉపాధ్యాయులు, రచయితలు, విద్యార్థులు, యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్, రైతులు వివిధ అంశాలపై జరిగిన పోటీలలో పాల్గొని గెలుపొందారు. రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి చైర్మన్ చాంబర్‌లో బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొద్దీన్ బహుమతులు ప్రదానం చేశారు.

పాస్టర్ల సంఘం జిల్లా కమిటీ ఎంపిక
అనంతపురం కల్చరల్, మార్చి 21: పాస్టర్ల సంఘం జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సుధాకర్‌బాబు అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా వేదనాయకం, జీవయ్యబాబులను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బీవీ.మోహన్, ఉపాధ్యక్షులుగా డేవిడ్ నాయక్, కోశాధికారిగా జోసెఫ్‌లను, మరో 50 మందిని సభ్యులుగాను ఎన్నుకున్నారు. క్రైస్తవ మైనార్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి రాష్ట్ర నాయకులు స్వామిదాస్ వివరించారు.