అనంతపురం

అధికార ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 21: అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని, అలాంటి అధికార ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వేషన్ వర్గాలు ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఆర్‌పీఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బహుజనులకు జనాభా దామాషాగా సంపదలోగాని, అధికారంలోగానీ వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడని, అభివృద్ధి మాత్రం శూన్యమని తెలిపారు. ముఖ్యంగా ప్రజలందరికీ విద్య, విద్యను అభ్యసించిన ప్రతి యువకుడికి ఉద్యోగం, ఆ ఉద్యోగానికి సరిపడు జీతం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. కావున బహుజనులందరూ ఐక్యమై ప్రభుత్వాలను అడ్డుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం
అనంతపురం సిటీ, మార్చి 21: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ డి.జగదీష్ తెలిపారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం నిరంత పోరాటాలు, ఆందోళనలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతోపాటు ద్రోహం చేస్తోందన్నారు. పార్లమెంటులో సైతం హోదా అంశం చర్చకు రాకుండా, అవిశ్వాస తీర్మానం జరగకుండా అడ్డుకుంటోందన్నారు. జిల్లాలో పార్టీలకు అతీతంగా జెండా, అజెండాలను పక్కనబెట్టి నియోజకవర్గాలు, మండలాల్లో సైతం జేఏసీలను ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. దీనిపై ఈ నెల 22న జాతీయ రహదారి దిగ్బంధం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడుగా ఎస్కేయూ ఆచార్యులు సదాశివరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దళితుల అభ్యున్నతి టీడీపీ ప్రభుత్వంతోనే...
* నగర మేయర్ స్వరూప
అనంతపురం కల్చరల్, మార్చి 21: అగ్రవర్ణాలకు దీటుగా దళితుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నగర మేయర్ మదమంచి స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న పేర్కొన్నారు. కార్పొరేటర్ బంగి సుదర్శన్ అధ్యక్షతన రుద్రంపేట గ్రామ పంచాయతీలో బుధవారం దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని దళితవాడలో ఇల్లిల్లూ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ముత్యాలమ్మ దేవాలయం వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేకూరుతోందన్నారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో అర్బన్ ఎమ్మెల్యే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.