క్రైమ్/లీగల్

ఈతకెళ్లి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, నవంబర్ 10 : మండల పరిధిలోని సీర్పికి చెందిన ప్రశాంత్‌కుమార్ (16) శనివారం ఈతకెళ్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ నాగస్వామి తెలిపిన వివరాల మేరకు సీర్పి గ్రామానికి చెందిన నాగలక్ష్మి కుమారుడు ప్రశాంత్‌కుమార్ గ్రామ సమీపంలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలోకి పడిపోయాడు. చాలాసేపైనా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు కేకలు వేసి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందాడన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి
యాడికి, నవంబర్ 10: మండల కేంద్రంలోని కొండకిందవీధికి చెందిన రవికుమార్, సావిత్రి కుమారుడు నగరి రంగా (13) ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వివరాల మేరకు.. వీరి ఇంటి దేవుడైన కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో ఉన్న బొలికొండ రంగనాథస్వామి వకు కుటుంబీకులతో కలిసి వెళ్తుండగా ఆటో డ్రైవర్ పక్కనే రంగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రంగా స్థానిక ఆదర్శపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

పాపినేపాళ్యంలో పట్టపగలే చోరీ
గార్లదినె్న, నవంబర్ 10 : మండల పరిధిలోని పాపినేపాళ్యంలో రైతు గురుస్వామిరెడ్డి ఇంట్లో శనివారం పట్టపగలే నాలుగున్నర తులాల బంగారు, రూ.30వేల నగదు చోరీకి గురైనట్లు ఎఎస్‌ఐ శేషగిరి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గురుస్వామిరెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి కోటలోకి వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాకు ఉన్న తాళం తీసి బంగారు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన గురుస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు గమణించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎఎస్‌ఐ శేషగిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు.