క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, మార్చి 21 : మండల పరిధిలోని బెళుగుప్ప తండాకు చెందిన నీలాబాయి (25) బుధవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు బెళుగుప్ప తండాకు చెందిన విజయకుమార్ నాయక్‌తో కొన్ని సంవత్సరాల క్రితం నీలాబాయితో వివాహమైంది. అయితే బుధవారం కుటుంబ కలహాలతో విసుగుచెంది విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య
కంబదూరు, మార్చి 21 : మండల పరిధిలోని మంద గ్రామంలో మల్లికార్జున (40) బుధవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ తోటలో చింతచెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నరసింహులు తెలిపారు. మృతుడు కొద్ది రోజుల నుంచి అనార్యోగం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండే వాడని బంధువులు తెలిపారు. మృతుడి భార్య గంగమ్మ, పెళ్లీడుకు వచ్చిన కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్నట్లు ఎస్‌ఐ నరసింహులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక కుమారుడి ఆత్మహత్య
పరిగి, మార్చి 21 : మండల పరిధిలోని గొరనహళ్లికి చెందిన రమేష్ (30) తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రమేష్ తల్లి మృతి చెందింది. దీంతో జీర్ణించుకోలేక రాత్రి గది పైకప్పనకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని శవం లభ్యం
పెద్దవడుగూరు, మార్చి 21 : మండల పరిధిలోని కొండూరు గ్రామ పరిధిలో పొలాల వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు. మృతి గురించి గ్రామాల్లో ఆరాతీయగా ఊరిబయట చిన్నచిన్న పిట్టలు పట్టుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని, పేరు, ఊరు వివరాలు తెలియవన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గడ్డివాము దగ్ధం..రూ.50వేలు నష్టం
బత్తలపల్లి, మార్చి 21 : పశువుల మేపు కొరకు నిల్వ చేసిన పశుగ్రాసంపై అగ్గిరవ్వలు పడడంతో రూ.50వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటరమణ పేర్కొన్నారు. మండలంలోని రాఘవంపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ పశువుల కొరకు 15 బండ్లు పశుగ్రాసాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో కొందరు చిన్నారులు పటాకులు పేల్చుకుంటూ ఆడుకునే సమయంలో అగ్గి రవ్వలు పశుగ్రాసంపై పడి మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చే సమయానికి 7 బండ్ల పశుగ్రాసం పూర్తిగా కాలిపోయినట్లు దీంతో రూ.50వేలు నష్టపోయినట్లు బాధితుడు వాపోయాడు.