అనంతపురం

23న చలో విజయవాడ విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, నవంబర్ 19: పండిత, పీఈటీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన విజయవాడలో పండిత గర్జనను నిర్వహిస్తున్నామని, ఈ గర్జనకు జిల్లాలోని పండితులందరు హాజరై విజయవంతం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రిస్వామి, తులసిరెడ్డిలు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పండిత పరిషత్ కార్యాలయంలో వారు విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండిత, పీఈటీల ఉన్నతీకరణకు నిర్ణయించడం హర్షనీయమన్నారు. ఈ ఉన్నతీకరణకు ఇంతవరకు ఉపాధ్యాయ సంఘాలైన ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ 1938, డీటీఎఫ్ సంఘాలు ఉన్నట్లుండి మాట మార్చి భాషా పండితుల గోడు వినకుండా అశాస్ర్తియంగా పండితుల పదోన్నతులు ఎస్జీటీలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ గర్జనను విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు.
25న యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలు
అనంతపురం సిటీ, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 44వ జిల్లా కౌన్సిల్ సమావేశాలను ఈ నెల 25వ తేదీ నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్, రమణయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీన ఉదయం 10 గంటలకు నగరంలోని కొత్తవూరు ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలపారు.