అనంతపురం

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, నవంబర్ 19: ఈ నెల 23, 24వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటన ఖరారు కానున్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో నిర్వహించిన మీకోసం కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. సంబంధిత శాఖాధికారులు విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వారి విధులను నిర్వహించాలన్నారు. 23వ తేదీన పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని ప్రశాంతి నిలయం వద్ద కార్తీక వన మహోత్సవంనందు పాల్గొంటారని, అనంతరం గ్రామదర్శిని కార్యక్రమం, గ్రామంలో 10స్టార్ అమలు వుండాలని, ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారి నుండి వారి ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారో తదితర విషయాలను లబ్ధిదారుల ద్వారా ముఖ్యమంత్రి ఆరాతీయడం జరుగుతుందని తెలిపారు. కప్పలబండ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, సీసీ రోడ్లు ప్రారంభించడం, ఎన్‌టీఆర్ గృహ నిర్మాణం లబ్దిదారులతో సీఎం ముచ్చటిస్తారని తెలిపారు. గ్రామశివారులోని చెన్నకేవశ ఆలయం వద్ద రచ్చబండ గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం సమయంలో మరాల వద్ద జల హారతి, అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఏర్పాట్లు సంబంధిత శాఖల అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
బాబు జాబ్ ఏదీ గోడపత్రిక విడుదల
అనంతపురం సిటీ, నవంబర్ 19: రాష్ట్రంలో 2014 ఎన్నికల ముందు నిరుద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగులు మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బాబు జాబ్ ఏదీ గోడపత్రికను బీజేవైఎం ఆధ్వర్యంలో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాబ్ రావాలంటే బాబు రావాలంటూ చెప్పి ప్రచారం చేసుకుని, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ కాలం గడుపుతూ లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేశారని పేర్కొన్నారు.