అనంతపురం

ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 19 : భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 93వ జయంతి వేడుకల సందర్భంగా ప్రతి యేటా నవంబర్ 19న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత తునీషియా దేశానికి చెందిన వైదేడ్ బొచమయి విశిష్ట అతిథిగా హాజరుకావడం విశేషం. సోమవారం ఉదయం సత్యసాయి నివాస మందిరం, యజుర్ నిలయం నుండి అనంతపురం, పుట్టపర్తి మహిళా కళాశాలల విద్యార్థినీలు మేళతాళాలు, బ్రాస్‌బాండ్ వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులతో సత్యసాయి చిత్రపటం, మంగళ కలశాన్ని ఊరేగింపుగా మహాసమాధి చెంత సభా స్థలికి చేరుకున్నారు. అక్కడ విద్యాబుద్ధులు నేర్పిన తమ ఆరాధ్య దైవం సత్యసాయికి జ్యోతి ప్రజ్వలన చేసి వేదమంత్రోచ్ఛారణలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవ విశిష్టతను సభికులకు తెలియపరుస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ సత్యసాయిబాబా తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఈశ్వరమ్మపై చూపిన ప్రేమ, వాత్సల్యం, స్ర్తి శక్తి, ఔన్నత్యం కోసం పాటుపడి యావత్ మహిళా లోకానికి మనో నిగ్రహాన్ని నింపిన చైతన్య దీప్తి సత్యసాయి అని కొనియాడారు. ఈ సందర్భంగా నోబెల్ అవార్డుగ్రహీత వైదేడ్ బొచమయి ప్రపంచ శాంతి సుస్తిరథకు స్వరాజ్ ఉద్యమాన్ని శాంతి మార్గంలో నడిపిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. ప్రపంచ శాంతి స్థాపనకు భారతదేశంలో శాంతి ఉద్యమం స్థానే అలనాడే బీజం పడిందన్నారు. విలువలు, నడవడి, సాంప్రదాయపు విలువలు, భారతదేశం, ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఆర్థిక అసమానతలు అస్తిరథకు మూలమన్నారు. మహిళలు అన్నిరంగాల ఎదగాలన్నారు. సత్యసాయి చూపించిన శాంతి, ప్రేమ, సేవ మార్గం ఆదర్శనీయమన్నారు. అదేవిధంగా పలువురు వక్తలు మహిళా దినోత్సవ విశిష్టతను తెలియపరిచే ఆసక్తికర ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా బొచమయిని మహిళా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
అలరించిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు
మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ప్రశాంతి నిలయంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మహిళా దినోత్సవం పురస్కరించుకుని అనంతపురం, పుట్టపర్తి క్యాంపస్ విద్యార్థులు కృతజ్ఞత పూర్వక కార్యక్రమాలు నిర్వహించారు. స్ర్తి విశిష్టతను, సత్యసాయి వైభవాన్ని కీర్తిస్తూ త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి నుండి స్ర్తి శక్తి ఔన్నత్యంపై నాటిక ప్రదర్శనలు అద్భుతంగా అలరించాయి. సోమవారం ఉదయం, సాయంత్రం బాబా జయంతి వేడుకలలో భాగంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ప్రజా సమస్యలను పునరావృతం కానివ్వద్దు
అనంతపురం సిటీ, నవంబర్ 19: మీకోసంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను త్వరిగతిన పరిష్కరించాలని, వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మీకోసం సందర్భంగా కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారులు 378 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జర్నలిస్టుల హౌసింగ్ స్కీం కొరకు దరఖాస్తులు ఆహ్వానం
అనంతపురం సిటీ, నవంబర్ 19: అక్రిడిటేషన్ కలిగి వున్న వర్కింగ్ జర్నలిస్టులు హౌసింగ్ స్కీం కొరకు ఆన్‌లైన్ లేదా నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చుని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె.జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఏహెచ్‌పి, బీఎల్‌స్‌నందు దరఖాస్తు చేసుకోదలచిన వారు నిర్ధేశించిన దరఖాస్తు ఫారం 10 రూపాయల స్టాంపు పేపరుతో కూడిన అఫిడవిట్, ఆధార్, రేషన్ కార్డులు జిరాక్స్‌లు, సర్వీసు ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యం నుండి కానీ లేదా గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ప్రతులను జతపరచాలన్నారు. బీఎల్‌సి కింద దరఖాస్తు చేసుకునే వారు, పత్రాలతోపాటు ఇంటి స్థలంకు సబందించిన ధృవపత్రపు ప్రతిని జతపరచాలన్నారు.