అనంతపురం

అరుదైన భాండాగారం సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 21 : విద్యలో విలువలను మేళవించి ప్రపంచానికి అరుదైన భాండాగారాన్ని ప్రసాదించిన భగవాన్ సత్యసాయి బాబా డీమ్డ్ యూనివర్శిటీ 37వ స్నాతకోత్సవం నేడు జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైన్స్ అండ్ టెక్నాలజీ, మంత్రిత్వ శాఖ, డీఐఆర్‌ఏసీ అధ్యక్షురాలు, ముఖ్య కార్యదర్శి డాక్టర్ రేణుస్వరూప్ హాజరవుతున్నారు. నానాటికీ సన్నగిల్లుతున్న విలువలకు జీవం పోస్తూ 37 యేళ్ల క్రితం భగవాన్ సత్యసాయి బాబా తన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో విలువలతో విద్యను బోధించేందుకు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీని ప్రారంభించారు. పుట్టపర్తిలోని ఎద్దులకొండపై ఆహ్లాదకరమైన వాతావరణంలో తాజ్‌మహల్‌ను పోలిన యూనివర్శిటీ పరిపాలన విభాగం భవనాన్ని అందమైన ఆకృతిలో నిర్మించారు. దీని కింద పుట్టపర్తి, అనంతపురం, ముద్దనహళ్ళి, బెంగళూరు బృందావనం క్యాంపస్‌లను ఏర్పాటుచేశారు. లక్షలాది మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను ఉచితంగా ప్రసాదించారు. విద్యలో మానవీయ విలువలు బోధించి తోటివారి పట్ల సత్ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో మెలిగి ఆర్జనే ధ్యేయం గాక తోటివారికి సాయం అందిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఆయన ప్రబోధించి ఆచరించి చూపారు. విద్య వ్యాపారమయమైన నేటి తరానికి విలువలు, నడవడిని నేర్పించిన మహనీయుడు భగవాన్ సత్యసాయి అని యావత్ సాయి భక్త ప్రపంచం కొనియాడుతోంది. ఆయన స్థాపించిన సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ దిగ్విజయంగా క్రమశిక్షణతో కూడిన నడవడి, విలువలతో కూడిన విద్య భాండాగారం నేడు 37వ స్నాతకోత్సవాన్ని జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెషర్ కేబీఆర్ వర్మ ఆధ్వర్యంలో ఛాన్స్‌లర్ హోదాలో మాజీ ఐఏఎస్ అధికారి చక్రవర్తి, రిజిష్టర్ సాయి గిరిధర్ ఆధ్వర్యంలో సుమారు 24 మందికి బంగారు పతకాలు, 8 మందికి డాక్టరేట్లు, 450 మందికి పట్టాలు అందజేయనున్నారు. సత్యసాయి విద్యా విధానం , విశిష్టతపై వక్తలు ప్రసంగించనున్నారు. ప్రశాంతి నిలయం స్నాతకోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ట్రస్టు ప్రతినిధులు ఆర్‌జే రత్నాకర్, డాక్టర్ మోహన్, చక్రవర్తి, నాగానంద తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎంపీ నిమ్మల
బుక్కపట్నం, నవంబర్ 21: ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మారాల రిజర్వాయర్‌కు విచ్చేస్తున్న సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎంపీ నిమ్మల కిష్టప్ప బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ సమావేశ ఏర్పాట్లను, రిజర్వాయర్‌లో జల హారతి ప్రదేశాన్ని, పైలాన్ వేదికను అధికారులు పరిశీలించారు. అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభా స్థలికి ముందు ఏర్పాటుచేస్తున్న వివిధ రకాల స్టాల్స్‌ను పరిశీలించి పలు సూచనలిచ్చారు. అలాగే హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ, ఎంపీలు పరిశీలించారు. సభాస్థలి, స్టాల్స్ ఏర్పాట్లు, పైలాన్ వేదిక, జల హారతి ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేసి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
* గ్రామదర్శిని - గ్రామ వికాసంలో మంత్రి పరిటాల సునీత
చెనే్నకొత్తపల్లి, నవంబర్ 21 : గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా తెదేపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి పథకంలోకి తీసుకువచ్చిందని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం మండల పరిధిలోని పులేటిపల్లి గ్రామంలో గ్రామదర్శిని - గ్రామవికాసంకు మంత్రి పరిటాల సునీత పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై వుందన్నారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సదుపాయాలతో గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెడుతున్న పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలన్నారు. గ్రామంలో సీసీ రోడ్లను మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో వున్నప్పటికీ ఇలాంటి సంక్షేమ పథకాలను అమలుచేయడం సీఎంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దశలవారీగా గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్‌టీఆర్ గృహ నిర్మాణం, చంద్రన్న బీమా, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ తదితర వంటి సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రభుత్వం తెదేపా ప్రభుత్వమన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులన్నింటినీ నింపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. త్వరలోనే పేరూరు ప్రాజెక్ట్‌కు హంద్రీనీవా జలాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేస్తామన్నారు.