క్రైమ్/లీగల్

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఏప్రిల్ 20: మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి రైల్వే పట్టాలపై పడవేసిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గమనించిన తిప్పేపల్లి గ్రామస్థులు వీఆర్‌ఓకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్‌ఐ గోపాలుడుకు సమాచారం తెలిపారు. దీంతో ఎస్‌ఐ గోపాలుడు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రెండు మూడు రోజుల క్రితం మరణించడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని ఎస్‌ఐ తెలిపారు. అయితే సంఘటనకు సంబందించి కారణాలు విచారణలో వెల్లడికావాల్సి ఉందని తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
గుడిబండ, ఏప్రిల్ 20 : మండల పరిధిలోని మోపురుగుండుకు చెందిన సురేష్ (25) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న తండ్రి రంగధామప్ప చికిత్సల కోసం రూ.5 లక్షల దాకా అప్పులు చేయగా తండ్రి మృతి చెందాడు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన సురేష్ ఇంటి సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.