ప్రేమంటే సులువుకాదురా ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీవ్, సిమీదాస్ జంటగా ఆర్.పి.ప్రొడక్షన్స్ పతాకంపై చందా గోవిందరెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. నందన్‌రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి బిగ్ సీడీని, బి.గోపాల్ ఆడియో సీడీని విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో రాజీవ్ సహాయ సహకారాలవల్లే ఈ చిత్రం అనుకున్న విధంగా తెరకెక్కించగలిగామని చిత్ర దర్శకుడు చందా గోవిందరెడ్డి, నిర్మాత భవనాసి రాంప్రసాద్, కొమారి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో గొప్ప పాటలు చేసిన సెనే్సషనల్ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా రూపొందించిన ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం అదృష్టమని సంగీత దర్శకుడు నందన్‌రాజ్ తెలిపారు. పాటలు, ట్రైలర్లు బాగున్నాయని, తప్పక ఘనవిజయం సాధించాలని బెక్కం వేణుగోపాల్, రాజ్‌కందుకూరి తెలిపారు. కార్యక్రమంలో కోటి, మధుర శ్రీ్ధర్, అయోధ్యకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాశీ విశ్వనాధ్, మధుమణి, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, వైజాగ్ అప్పారావు, టార్జాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందా గోవిందరెడ్డి.