క్రీడాభూమి

భయపడుతున్న ఆసీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 17: ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ భయపెడుతున్నది. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ని హాట్ ఫేవరిట్ భారత్‌తో ఆడి, అనూహ్య విజయాన్ని సాధించిన ‘అండర్ డాగ్’ కివీస్‌ను తక్కువ అంచనా వేస్తే శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఇతర క్రీడాకారులు గురువారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాతో మ్యాచ్‌కి ముగ్గురు స్పిన్నర్లను న్యూజిలాండ్ బరిలోకి దింపింది. ఆ స్పిన్నర్లే పటిష్టమైన భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తుచేశారు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పెద్దగా ఇబ్బంది పడని ఆస్ట్రేలియా స్పిన్ విషయంలో వెనుకబడింది. నాథన్ మెక్‌కలమ్ 15 పరుగులకు రెండు, మిచెల్ సాంట్నర్ 11 పరుగులకే నాలుగు, ఇష్ సోధీ 18 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరిని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది ఆస్ట్రేలియాను వేధిస్తున్న ప్రశ్న. స్మిత్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖాజా, మిచెల్ మార్ష్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ అండ ఉన్నప్పటికీ, కివీస్‌కు కొత్త అస్త్రంగా మారిన స్పిన్ విభాగం ఆసీస్‌కు కునుకులేకుండా చేస్తున్నది. కాగితంపై చూస్తే ఇరు జట్లు దాదాపు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఫలితాలను బట్టి ఆస్ట్రేలియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకొని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న కివీస్ ఎప్పుడు ఏ విధంగా విరుచుకుపడుతుందో అర్థంకాని పరిస్థితి. ఆస్ట్రేలియా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సమస్యను కోరితెచ్చుకున్నట్టే అవుతుంది. (చిత్రం) నెట్స్‌కు హాజరైనప్పుడు సహచరుడు గ్లేన్ మాక్స్‌వెల్‌కు బ్యాటింగ్‌లో సూచనలు ఇస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్
వర్షం బెడద
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) క్రికెట్ మైదానంలో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌కి వర్షం బెడద తప్పేటట్టు లేదు. వాతావరణ శాఖ చేసిన ప్రకటన ప్రకారం జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడితే, ఓవర్లను కుదించాల్సి వస్తుంది. అప్పటికీ ఆటను కొనసాగించడం అసాధ్యమైతే, మ్యాచ్‌ని రద్దు చేయక తప్పదు.