అవీ .. ఇవీ..

అవీ..ఇవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-భారతి
----------------
మంచులో యోగా
తొలివేకువలో బాలభానుడి లేలేత కిరణాలు మేనిపై పడుతున్నప్పుడు యోగా చేయడం చాలామందికి అలవాటే. మనసుకు హాయినిచ్చే పసందైన వాతావరణంలో యోగా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. చైనాలో అయితే కొందరు ఔత్సాహికులు దట్టంగా మంచు అలుముకున్నా వెరవక యోగా నేర్చుకుంటున్నారు. చైనాలోని హెనన్ ప్రావిన్స్ పరిధిలోని లుయాంగ్‌లో ఈ శిక్షణ కొనసాగుతోంది.

వెలుగుపండుగ
సాధారణ రోజుల్లో రాత్రివేళ చీకటిగా ఉండే లండన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు విద్యుద్దీపకాంతులలో మెరిసిపోతున్నాయి. ప్రతి జనవరిలో జరిగే సెరిడ్రిక్ లుమిరె ఫెస్టివల్ సందర్భంగా లండన్‌లోని 30 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు, ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇదిగో ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవన్నీ వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కళాకారులు తీర్చిదిద్దినవే. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కళాకారుడు ఇలా విద్యుత్ వెలుగులు విరజిమ్మే కాస్ట్యూమ్స్‌తో ఇలా కనువిందు చేస్తే లండన్‌కు చెందిన కళాకారులు ఇలా ఆక్స్‌ఫర్డ్ సర్కస్‌ను కళ్లకు కట్టే కళారూపాన్ని ఇలా ప్రదర్శించారు.

ఇది చిరుతే..
పసుపుఛాయ, నల్లని చుక్కలతో కూడిన శరీరంతో కన్పించాల్సిన చిరుత ఇలా కన్పిస్తే ఆశ్చర్యమే. ఈ చిత్రంలో కన్పిస్తున్నది నిజంగా చిరుతే. అయితే దీక్షగా వేటలో నిమగ్నమైపోయి వేగంగా దూసుకువెళ్లి ఓ బురదగుంతలో దిగబడిపోవడంతో ఇలా తయారైంది. దక్షిణాఫ్రికాలోని ఒక ప్రైవేటుగేమ్ రిజర్వ్‌లో ఈ దృశ్యం కన్పించగానే క్లిక్‌మన్పించాడు కేటర్స్ సంస్థకు చెందిన ఫొటోగ్రాఫర్ హ్యుగొ బ్రాడ్.
*